Natyam ad

పుంగనూరులో సరస్వతిదేవి రూపంలో అమ్మవార్లకు పూజలు

పుంగనూరు ముచ్చట్లు:

నవరాత్రి ఉత్సవాలలో వైభవంగా ఆదివారం ఏడవ రోజు అమ్మవార్లను సరస్వతిదేవి రూపంలో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. పట్టణంలోని శ్రీవిరూపాక్షి మారెమ్మను, శ్రీబోగనంజుండేశ్వరస్వామి ఆలయంలో గల శ్రీపార్వతిదేవిని ,శ్రీచాముండేశ్వరిదేవిని, శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి దేవి, చదళ్లలో శ్రీచౌడేశ్వరిదేవి అమ్మవార్లను సరస్వతిదేవి రూపంలో ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. అలాగే ఏడూరు వద్ద శ్రీలక్ష్మీనరసింహస్వామిని ప్రత్యేక పూలతో అలంకరించారు. ఈ సందర్భంగా భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.

Post Midle

Tags: Pujas to Ammavars in the form of Goddess Saraswati in Punganur

Post Midle