19 వేలకు పులస చేప

రాజమండ్రి ముచ్చట్లు:


సీ ఫుడ్ లవర్స్ నోరు ఊరేలా ఎదరు చూసేది పులస కోసమే. ఆస్తులు అమ్ముకొనైనా పులస చేప కూర తినాలన్నది ఓ మాట. జీవితంలో ఒక్కసారైనా పులస చేప కూర తినాల్సిందే అంటారు గోదావరి జిల్లాల  ప్రజలు. అందుకే వర్షాకాలంతో పాటు.. పులస  కోసం వారంతా ఎదురు చూస్తారు. వారి చూపులు ఫలించాయి. సాధారణంగా ఉభయగోదావరి జిల్లాల్లో మాత్రమే దొరికే చేప పులస. అత్యంత ఖరీదైన చెపగా ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఈ పులస గుర్తింపు తెచ్చుకుంది. ఈ చేపకోసం ఏడాది పొడవునా జిల్లావాసులు ఎదురుచూస్తారంటే అతిశయోక్తి కాదు. అందుకే పుస్తెలమ్మి అయిన సరే పులస తినాలి అన్న సామెత వచ్చింది. ఎందుకంటే పులస కూర అంత రుచిగా ఉంటుంది. అందుకే పులస అంటే అంత మోజు. మసాలా దట్టించి మాంచి రుచిగా వండితే ఆ ఘుమఘుమలకి నోరూరిపోవడం ఖాయం. చేపల కూర వాసన చెప్పకపోయినా తెలుస్తుంది. అందుకే ఈ పులస మార్కెట్ లోకి వచ్చిందంటే చాలు.. నాన్ వెజ్ ప్రియులు  కొనడానికి భారీ సంఖ్యలో మార్కెట్ కు చేరుకుంటారు. అంతగా డిమాండ్ ఉంటుంది ఈ చేపకు. ధర కూడా డిమాండ్ ను బట్టి వేల రూపాయలు పలుకుతుంది.సాధారణంగా భారీ వర్షాలు పడే సమయంలో.. వరదల సమయంలో ఈ పులసలు భారీగా దొరుకుతుంటాయి.

 

 

 

అయితే ఈ సారి వాటి జాడ లేకపోవడంతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ పులస కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తూ ఉన్నారు. ఈ ఏడాదికి పులసను మరిచిపోవాలా అనుకుంటున్న సమయంలో గోదావరి వరద ఉధృతి తగ్గడంతో తూర్పుగోదావరి జిల్లా యానాం చేపల మార్కెట్ లో పులస చేప సందడి చేసింది. భైరవపాలెంకు చెందిన వ్యక్తి పులసకు వేలంపాట నిర్వహించారు. సుమారు 2 కిలోల బరువున్న తాజా పులస చేపను పార్వతి అనే మహిళ భారీ ధరకు కొనుగోలు చేసింది. పులసను వేలం పాటలో 19 వేల రూపాయలకు కొనుగోలు చేసింది పార్వతి. ప్రస్తుత సీజన్ లో పులసల అమ్మకం మొదలయ్యాక ఇదే అధిక ధరని స్థానికులు చెబుతున్నారు.తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని అంతర్వేది, భైరవపాలెం, నరసాపురంలో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. గోదావరి జలాలు సముద్రంలో కలిసే ఈ రెండు పాయల దగ్గర పులసలు ఎక్కువగా దొరుకుతాయని స్థానికులు చెబుతున్నారు.ఎక్కడో ఆస్ట్రేలియాలో పుట్టి.. న్యూజిలాండ్ .. టాంజినీయా దేశాలను దాటుకుని.. హిందూమహాసముద్రంలో ప్రయాణించి అక్కడనుంచి బంగాళాఖాతానికి చేరుకుటుంది పులస. ఎప్పుడైతే ఎగువన వర్షాలకు గోదావరిలోకి ఎర్ర నీరు వస్తుందో ఆ శ్రేష్టమైన మంచి నీటిని త్రాగడానికి గోదావరి సముద్రం కలిసే అంతర్వేదిలో ఇవి ఎదురీది గోదావరిలోకి చేరుకుంటాయి. ఈ సీజన్‌లో ఇంత ధర పలకడం ఇదే మొదటిసారి అని స్థానికులు చెబుతున్నారు. భైరవపాలెం మొగ వద్ద ఇసుక మేటల వల్ల సముంద్రంలో నుంచి గౌతమి పాయలోకి పులసలు తక్కువగా వస్తున్నాయని మత్స్యకారులు చెబుతున్నారు.

 

Tags: Pulasa fish for 19 thousand

Leave A Reply

Your email address will not be published.