Natyam ad

తిరుమ‌ల‌లో పల్స్ పోలియో అవగాహన ర్యాలీ

తిరుమ‌ల‌ ముచ్చట్లు:

తిరుమలలో శనివారం పల్స్ పోలియో అవగాహన ర్యాలీని ఎస్వీ హైస్కూల్ నుండి బాలాజీ నగర్ వ‌ర‌కు నిర్వహించారు.ఐదేళ్లలోపు పిల్లలకు మార్చి 3వ తేదీ ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో పల్స్ పోలియో చుక్కలు వేస్తారు. దీనిపై అవగాహన కల్పించేందుకు అశ్విని ఆసుపత్రి సివిల్ సర్జన్ డాక్టర్ కుసుమ కుమారి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో డిఈవో డా. భాస్కర్ రెడ్డి, హెడ్ నర్సు  సావిత్రమ్మ, ఇతర ఆసుపత్రి సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు.

Post Midle

Tags:Pulse Polio Awareness Rally in Tirumala

Post Midle