Natyam ad

పుంగనూరులో పల్స్  పోలియో విజయవంతం

పుంగనూరు ముచ్చట్లు:

పల్స్  పోలియో కార్యక్రమాన్ని ఆదివారం అందరి సహకారంతో విజయవంతంగా నిర్వహించినట్లు ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన రాంపల్లెలో మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ సల్మాతో కలసి పోలియో చుక్కలు వేసి శిబిరాన్ని ప్రారంభించారు. అలాగే పట్టణంలోని మున్సిపల్‌ కార్యాలయం వద్ద కమిషనర్‌ నరసింహప్రసాద్‌, చైర్మన్‌ అలీమ్‌బాషా పోలియో చుక్కలు వేసి ప్రారంభించారు. మండలంలో 3671 వేల మంది పిల్లలు ఉన్నారని , వీరిలో ఇప్పటి వరకు 3172 మందికి చుక్కలు వేశారు. ఇందు కోసం 84 సెంటర్లు ఏర్పాటు చేశారు. పట్టణంలో 38 సెంటర్లలలోను 3953 మంది పిల్లలు ఉన్నారు. వీరిలో 4115 మందికి చుక్కలు వేశారు. మిగిలిన వారికి సోమవారం ఇంటింటికి వెళ్లి వైద్య సిబ్బందిచే చుక్కలు వేయించనున్నట్లు కమిషనర్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో సచివాలయాల కన్వీనర్‌ రాజశేఖర్‌రెడ్డి, జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్‌ అమ్ము తదితరులు పాల్గొన్నారు.

Tags: Pulse Polio is successful in Punganur