గోదావరి జిల్లాల్లో  సైకిల్ కు పంక్చర్

Date:23/05/2019

రాజమండ్రి ముచ్చట్లు:

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలంటే అందరి చూపు ఉభయ గోదావరి జిల్లాల వైపే ఉంటుంది. ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలనేది ఆ జిల్లాల్లోని ప్రజా తీర్పుపైనే ఆధారపడి ఉంటుంది. ఈ రెండు జిల్లాల్లో మొత్తం 34 స్థానాలు ఉన్నాయి. ఇప్పటివరకు వెల్లడైన ఫలితాల్లో వైసీపీ అత్యధిక స్థానాల్లో ఆధిక్యంలో దూసుకుపోతుంటే.. టీడీపీ వెనుకంజలో ఉంది. తూర్పు గోదావరి జిల్లాలోని 19 స్థానాల్లో టీడీపీ 5 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది. మిగతా 14 స్థానాల్లో వైసీపీ ఆధిక్యంలో ఉంది. పెద్దాపురంలో టీడీపీ అభ్యర్థి నిమ్మకాయల చినరాజప్ప.. వైసీపీ అభ్యర్థి తోటవాణిపై ఆధిక్యంలో ఉన్నారు. రామచంద్రపురంలో టీడీపీ అభ్యర్థి తోట త్రిమూర్తులు.. వైసీపీ అభ్యర్థి శ్రీనివాస వేణుగోపాల కృష్ణపై ఆధిక్యంలో ఉన్నారు. రాజమండ్రి సిటీలో టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి భవానీ.. వైసీపీ అభ్యర్థి రౌతు సూర్య ప్రకాశ్‌రావుపై లీడింగ్‌లో ఉన్నారు. రాజమండ్రి రూరల్‌లో టీడీపీ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి.. వైసీసీ అభ్యర్థి ఆకుల వీర్రాజుపై ఆధిక్యంలో ఉన్నారు.

 

 

 

 

 

మండపేటలో వైసీపీ అభ్యర్థి పిల్లి సుభాష్ చంద్రబోస్‌పై టీడీపీ అభ్యర్థి వేగుళ్ల జోగేశ్వరరావు ఆధిక్యత కనబరుస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని 15 స్థానాల్లో టీడీపీ రెండు స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది. పాలకొల్లులో వైసీపీ అభ్యర్థి డాక్టర్ బాబ్జీపై టీడీపీ అభ్యర్థి నిమ్మల రామానాయుడు, ఉండిలో వైసీపీ అభ్యర్థి పీవీఎల్ నరసింహరాజుపై టీడీపీ అభ్యర్థి రామరాజు ఆధిక్యంలో ఉన్నారు. అయితే, భీమవరంలో జనసేన, వైసీపీ మధ్య టఫ్‌ఫైట్ నడుస్తోంది. 2014లో టీడీపీ తూర్పు గోదావరి జిల్లాలోని 19 స్థానాల్లో 12 స్థానాలు టీడీపీ, ఒక స్థానాన్ని బీజేపీ గెలుపొందింది. వైసీపీ 5, ఇతరులు 1 స్థానం గెలుపొందారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని 15 స్థానాల్లో బీజేపీ 1, టీడీపీ 14 స్థానాల్లో గెలుపొందింది. గత ఎన్నికల్లో పశ్చిమలో ఒక్క సీటు కూడా గెలుపొందని వైసీపీ ఈ సారి 13 స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తోంది.

 

నాలుగోసారి ఓడిపొయిన సోమిరెడ్డి

Tags: Puncture for cycling in Godavari districts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *