బీ.1.1.28.2 ’అనే కొత్త వేరియంట్‌ను గుర్తించిన పూణే శాస్త్రవేత్తలు

న్యూఢిల్లీ ముచ్చట్లు :

 

భారత్‌లో కరోనా విజృంభించేందుకు డెల్టా వేరియంటే కారణమని నిపుణులు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే మరో ప్రమాదకరమైన వైరస్‌ను గుర్తించారు. పూణేలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ (ఎన్‌ఐవీ) నిర్వహించిన జీనోమ్‌ సీక్వెన్సింగ్‌లో కరోనా వైరస్‌ ‘బీ.1.1.28.2 కొత్త వేరియంట్‌ను శాస్త్రవేత్తలు గుర్తించారు. బ్రెజిల్‌, యూకే నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల నుంచి సేకరించిన నమూనాలను సేకరించి.. జన్యుక్రమాల (జీనోమ్‌ సీక్వెన్సింగ్‌)ను విశ్లేషించగా ‘బీ.1.1.28.2’ వేరియంట్‌ వెలుగులోకి వచ్చింది.వేరియంట్‌ను తొమ్మిది సిరియన్‌ రకానికి చెందిన ఎలుకల్లో ప్రవేశ పెట్టగా.. ఇన్ఫెక్షన్‌ సోకిన వారం రోజుల్లోనే లక్షణాలు బయటపడడం ప్రారంభమైందని పరిశోధకులు తెలిపారు. శరీరంలో ఇన్ఫెక్షన్‌ భారీగా వ్యాపించడంతో మూడు ఎలుకలు చనిపోయాయని పేర్కొన్నారు. వేరియంట్‌ కొత్త వేరియంట్ శరీర బరువు తగ్గించిందని, శ్వాసకోశ, ఊపిరితిత్తుల్లో సమస్యలకు కారణమైందని తెలిపారు. ఈ కొత్త వేరియంట్‌ డెల్టా వేరియంట్‌తో సమానమని, ఆల్ఫా వేరియంట్‌ కంటే ప్రమాదకరమని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే, వైరస్‌పై వ్యాక్సిన్ల సమర్థతను తెలుసుకునేందుకు మరిన్ని పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags: Pune scientists have identified a new variant called B.1.1.28.2 ‘

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *