స్వామి వివేకానందుని బాటలో పుంగనూరు యూత్‌

Punganoor Youth in the path of Swami Vivekan

Punganoor Youth in the path of Swami Vivekan

Date:11/01/2019

పుంగనూరు ముచ్చట్లు:

స్వామివివేకానందుని బాటలో పుంగనూరు యువత నడుస్తూ , పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రేమే జీవనమార్గం లక్ష్యాన్ని చేరే వరకు విశ్రమించరాదు… దైర్యమే జీవితం…బలహీనతే మృత్యువు అనే వివేకానందుని మాటలను స్పూర్తిగా తీసుకుని సమాజ సేవలో నిమగ్నమౌతున్నారు స్వామివివేకానంద యువజన సభ్యులు.

పుంగనూరు పట్టణంలోని హైస్కూల్‌ వీధిలో 2013లో స్వామివివేకానంద యువజన సంఘాన్ని ఏర్పాటు చేశారు. నలుగురితో ప్రారంభమైన ఈ సంఘం ప్రస్తుతం వందమందికిపైగా సభ్యులు ఉన్నారు. సంఘంలో తొలుత కుంచకుమార్‌, శరత్‌, ప్రకాష్‌, సతీష్‌, కుమార్‌, ఇంతియాజ్‌, గిరిధర్‌లతో సంఘం ప్రారంభమైంది. సంఘ సభ్యులు, తమ స్నేహితులు భగత్‌సింగ్‌కాలనీ కుమార్‌, విజయ్‌, నాగరాజు, శ్రీనాథ్‌, దివాకర్‌, హరి, ప్రవీన్‌, జగదీష్‌, మహేష్‌, రంజిత్‌, గౌతమ్‌, గంగామహేష్‌, మురళి, గంగాధర్‌, బార్గవ్‌, విజయ్‌లు సభ్యులుగా ఉన్నారు. వీరికి సలహాదారులుగా డాక్టర్‌ పి.శివ , త్రిమూర్తిరెడ్డి, సాంబమూర్తి ఉన్నారు. సభ్యులు ప్రతి కార్యక్రమంలోను పాల్గొంటు , సొంత నిధులు సేకరించి, ప్రతి రోజు రోడ్లపైన , ఆలయాల వద్ద ఉన్న యాచకులకు అన్నదానం చేసి, ఆకలి బాధ తీర్చుతారు. అలాగే ఎవరికి అవసరమైన స్వచ్చంధంగా వెళ్లి రక్తదానం చేయడం అలవర్చుకున్నారు. ఇప్పటి వరకు 400 మందికి రక్తదానం చేశారు. అలాగే ప్రతియేటా జయంతి రోజున జాతీయ పతాకాలను పట్టుకుని పట్టణంలో ర్యాలీ నిర్వహిస్తారు. గత ఆగస్టు 15 నుంచి ప్రారంభించిన నిత్యజనగణమన గీతాలాపనలో ప్రతి రోజు పాల్గొంటు దేశభక్తిని చాటుకుంటున్నారు. పాఠ శాల విద్యార్థులకు ప్రతియేటా వివేకానందుని జయంతి రోజు వివేకానందుని జీవితగాథల పుస్తకాలను పంపిణీ చేసి, విద్యార్థులు ఉత్తమ పౌరులుగా తయారైయ్యేందుకు కృషి చేస్తున్నారు. జయంతిని పురస్కరించుకుని ఈయేడు విద్యార్థులకు టీషర్టులను పంపిణీ చేశారు.

మున్సిపాలిటిలో సంక్రాంతి సందడి

Tags: Punganoor Youth in the path of Swami Vivekan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *