పుంగనూరు ఆదర్శ కళాశాలలో ప్రతిభ చాటిన విద్యార్థులు
పుంగనూరు ముచ్చట్లు:
మండలంలోని అడవినాథునికుంటలో గల ఆదర్శ పాఠశాలలో విద్యార్థులు అధిక మార్కులు సాధించి ఆదర్శంగా నిలిచారు. గురువారం ప్రిన్సిపాల్ టిఎన్.రమ తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. ఇంటర్మీడియట్ వెహోదటి సంవత్సరంలో బైపీసి చదివిని పి.శ్రావణి 406 మార్కులు సాధించింది. అలాగే బైపిసిలో బి.పల్లవి 388 మార్కులు సాధించింది. సీఈసీలో భరత్‌కుమార్ 444 మార్కులు, ఎంఈసీలో జీవన్‌కుమార్ 369 మార్కులు సాధించారు. ద్వితీయ సంవత్సరం ఎంపీసీలో ఎల్.స్నేహా 928 మార్కులు, సిపి.భవ్య బైపిసిలో 906 మార్కులు, కె.విక్రమ్ సీఈసీలో 846 మార్కులు సాధించారు. అలాగే బసవరాజ ప్రభుత్వ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న పి.పవిత్ర ఎంపీసీలో 932 మార్కులు, సి.నాగవేణి సీఈసీలో 921 మార్కులు, కె.పవిత్ర హెచ్‌ఈసిలో 943 మార్కులు, ఎస్.మోసినా ఓకల్‌సీఈసీలో 970 మార్కులు సాధించారు. వీరిని ప్రిన్సిపాల్స్ కమలాకర్, రమ, తల్లిదండ్రులు , ఉపాధ్యాయులు అభినందించారు.

Tags: Punganur Adarsh College’s meritorious students
