పుంగనూరు అంగన్‌వాడీలు ప్రీఇంగ్లీష్‌ మీడియం స్కూళ్లు – ఐసిడిఎస్‌పీవో భారతి

Date:18/01/2021

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు ఐసిడిఎస్‌ పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాలను ప్రీ ఇంగ్లీష్‌మీడియం స్కూళ్లుగా మార్చి, ఈమేరకు అంగన్‌వాడీ సిబ్బందికి శిక్షణ ఇస్తున్నామని ఐసిడిఎస్‌ పీవో భారతి తెలిపారు. సోమవారం ఉబేదుల్లాకాంపౌండులో గల అంగన్‌వాడీ కేంద్రంలో అంగన్‌వాడీ సిబ్బందికి, కార్యకర్తలకు ఐదురోజుల శిక్షణా తరగతులను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా భారతి మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లలకు సృజన్మాత్మక విద్యతో పాటు ఆట, పాట , మాట పై అవగాహన కల్పించాలన్నారు. అలాగే సాధారణ ఇంగ్లీష్‌ మాటలతో బోదించడం, ఇంగ్లీష్‌లో పరిచయ కార్యక్రమాలు , టీచర్లతో పరిచయ కార్యక్రమాలు అలవర్చాలన్నారు. అలాగే ప్రతి రోజు ఆరోగ్యము, మంచి అలవాట్లపై వీడియో ద్వారా శిక్షణ ఇవ్వాలని సూచించారు. వీటిపై ఐదు రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. శిక్షణ పొందిన తరువాత అంగన్‌వాడీలలో ప్రభుత్వం నిర్ధేశించిన మేరకు బోధన చేయనున్నట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్‌ అమ్ము, ఐసిడిఎస్‌ సూపర్‌వైజర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

అయోధ్యలో రామాలయ నిర్మాణానికిఅర్వపల్లి కోటేశ్వర్రావు సత్యవతి దంపతులు విరాళo

Tags: Punganur Anganwadi Pre-English Medium Schools – ICDSPVO Bharathi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *