Natyam ad

పుంగనూరులో నోముల పండగకు వెళ్లి వస్తున్న దంపతులపై కత్తులతో దాడి

-భర్త మృతి
-తప్పించుకున్న భార్య

– పుంగనూరులో విషాదం

పుంగనూరు ముచ్చట్లు:

Post Midle

కార్తీకమాసం తొలిరోజైన సోమవారం పెళ్లి జరిగి ఏడాది కావడంతో నోముల పండగను తొలిసారిగా అత్తవారింట్లో ఆడంబరంగా జరుపుకోవడం ఆనవాయితీ. ఇందు కొసం అత్తవారి ఇంటికి వెళ్లి సంతోషంగా పండుగను జరుపుకుని తిరిగి రాత్రి వస్తుండగా గుర్తు తెలియని దుండగులు దంపతులపై కారప్పొడి చల్లి కత్తులతో దాడి చేయగా భర్త మృతి చెందగా, భార్య స్వల్పగాయాలతో బయటపడిన సంఘటన సోమవారం రాత్రి మండలంలోని తుర్లపల్లె సమీపంలో గల కొత్తకుంట వద్ద జరిగింది. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని బత్తలాపురం గ్రామానికి చెందిన రెడ్డెప్ప కుమారుడు దామోదర్‌ (25)కు ఏడాది క్రితం పెద్దపంజాణి మండలం పెనుగొలకలకు చెందిన చంద్రమోహన్‌కుమారై అనురాధ (22) తో వివాహం జరిగింది. కొత్త సంవత్సరం నోముల పండుగ అత్తవారి ఇంట్లో జరుపుకోవడం ఆనవాయితీ కావడంతో దామోదర్‌ తన భార్యను తీసుకుని ద్విచక్రవాహనంపై అత్తవారి ఇంటికి వెళ్లాడు. రాత్రి వరకు అత్తవారి ఇంట్లో పండుగను సంతోషంగా జరుపుకుని సుమారు 7:30 గంటల సమయంలో దామోదర్‌ తన భార్య అనురాధను తీసుకుని ద్విచక్రవాహనంపై తన స్వగ్రామమైన బత్తలాపురంకు బయలుదేరారు. మార్గ మధ్యంలో తుర్లపల్లె కొత్తకుంట వద్దకు రాగానే ముగ్గరు గుర్తు తెలియని వ్యక్తులు ద్విచక్రవాహాన్ని అడ్డుకుని కళ్లల్లో కారప్పొడి చల్లి , కత్తులతో విచక్షణారహితంగా పొడవడంతో దామోదర్‌ అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. భార్య అనురాధ స్వల్పగాయాలతో బయటపడింది. వెంటనే దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. ఈ సంఘటనపై బాధితురాలు అనురాధ కుటుంబ సభ్యులకు సెల్‌ఫోన్‌లో సమాచారం అందించడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. సీఐ గంగిరెడ్డి, పెద్దపంజాణి పోలీసులు సంఘటన స్థలాన్ని సందర్శించారు. హత్యకు గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. హతుడి శవాన్ని పోస్టుమార్టంకు తరలించి , కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హంతకుల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. కాగా ఈ సంఘటనతో రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

 

Tags: Punganur attack on couple going to Nomula festival with knives – Tragedy in Punganur

Post Midle

Leave A Reply

Your email address will not be published.