రోడ్డు ప్రమాదంలో పుంగనూరు ఆటోడ్రైవర్‌ మృతి

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని రామసముద్రం రోడ్డులో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్‌ మార్కోండయ్య(50) మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని మేలుపట్లకు చెందిన మార్కొండయ్య రామసముద్రం రోడ్డులోని ఈద్గా వద్ద ఆటో నడుపుకుని వెళ్తుండగా రామసముద్రంకు చెందిన కారుడ్రైవర్‌ శంకర మధ్యం మత్తులో కారును అతివేగంగా నడిపి, ఆటోను ఢీకొనడంతో ఆటో బోల్తా పడి మార్కొండయ్య డ్రైవర్‌ అక్కడేక్కడే మృతి చెందాడు. వెంటనే ఆప్రాంత వాసులు మార్కొండయ్యను కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. ఎస్‌ఐ మోహన్‌కుమార్‌ కేసు నమోదు చేసి, శవాన్ని పోస్టుమార్టంకు తరలించి దర్యాప్తు చేస్తున్నారు.

 

Tags: Punganur auto driver died in a road accident

 

Leave A Reply

Your email address will not be published.