Natyam ad

పుంగనూరు బసవరాజ కళాశాలకు 142 సంవత్సరాల చరిత్ర- మంత్రి పెద్దిరెడ్డి కృషి

– నాడు-నేడుతో పూర్వ వైభవం.

పుంగనూరు ముచ్చట్లు:

Post Midle

ఎందరో ప్రముఖులు , ఉన్నతాధికారులకు అక్షరాలు నేర్పించి, దేశ, విదేశాలలో స్థిరపడేందుకు సరస్వతి నిలయంగా నిలిచిన బసవరాజ హైస్కూల్‌, కళాశాల ప్రారంభించి 142 సంవత్సరాలైంది. ఎంతో ఘన చరిత్ర కలిగిన హైస్కూల్‌లో లక్షలాది మంది విద్యావంతులై వివిధ రంగాలలో స్థిరపడ్డారు.

పుంగనూరులోని బసవరాజ హైస్కూల్‌కు సుధీర్ఘ చరిత్ర ఉంది. సుమారు 142 ఏళ్ల క్రితం పుంగనూరు జమీందారులు ఏడేకరాల స్థలంలో ఈ హైస్కూల్‌ను నిర్మించారు. జమీందార్‌ రాజవీరబసవ చిక్కరాయల్‌ వైబి తన కుమారుని పేరున బసవరాజ హైస్కూల్‌ను 1881లో ప్రారంభించారు. కళాశాలలో 170 మంది విద్యార్థులు చదువుతున్నారు.అలాగే జిల్లాలోనే ఇంత చరిత్ర, పెద్ద హైస్కూల్‌ ఎక్కడా లేకపోవడం గమనార్హం. హైస్కూల్‌లో ప్రస్తుతం 419 మంది విద్యార్థులు చదువుతున్నారు. వెహోత్తం 22 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. 26 గదుల్లో తరగతులు జరుగుతున్నాయి. ఈ పాఠశాలలో విద్యనభ్యసించి వారు ఐఏఎస్‌, ఐపిఎస్‌లుగా, జర్నలిస్టులుగా, డాక్టర్లు, ఇంజనీర్లుగా పని చేస్తున్నారు. కొంత మంది ఉద్యోగరీత్యా విదేశాల్లో స్థిరపడ్డారు. అటువంటి పాఠశాల ఆదరణకు నోచుకోకపోవడంతో రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిధున్‌రెడ్డి కలసి నాడు-నేడు పథకం క్రింద రూ.1.72 కోట్ల రూపాయలు మంజూరు చేయించి, 11 గదులు నిర్మించి, మౌళిక వసతులు ఏర్పాటు చేశారు.

పాఠశాలలో చదివిన ప్రముఖులు….

ఈ పాఠశాలలో చదువుకున్న శేషగిరిశా సీనియర్‌ జర్నలిస్టుగా ఉండి, జవహర్‌లాల్‌ నెహ్రూకు సన్నిహితుడుగా మెలిగారు. ఆ సమయంలో రౌండు టేబుల్‌ సమావేశం తర్వాత మౌంట్‌బాటన్‌ అమెరికా నుంచి ఇండియా ఆగమనం అన్న తొలి సంచలన వార్తను రాశారు. దీంతో దేశంలోనే విశేషమైన గౌరవాన్ని ఆనాడు పొందారు. అలాగే చారాల చెన్నారెడ్డి అప్పటి మద్రాస్‌ ముఖ్యమంత్రి భావానగర్‌ మహారాజ్‌ సన్నిహితుడుగా పేరు తెచ్చుకున్నారు. ఆనారోగ్యం కారణంగా చెన్నారెడ్డి పుంగనూరు సమీపంలోని చారాలకు చేరుకున్నారు. ముఖ్యమంత్రి భావానగర్‌ మహారాజ్‌ చారాల వచ్చి చెన్నారెడ్డిని పరామర్శించారు. వీరి అనుబంధం ఎలాంటిదో దీనిని బట్టి తెలుస్తోంది. ఈ పాఠశాలలో విద్యనభ్యసించిన ఆర్‌. వెంకటరెడ్డినెహ్రూ ప్రధానిగా ఉన్న సమయంలో ప్లామెంటు సెక్రటరీగా పని చేశారు. ఎన్‌. జయరామిరెడ్డి కాఫీబోర్డు చీఫ్‌ మార్కెంటింగ్‌ అధికారిగా పని చేశారు. డాక్టర్‌ సేతు మాధవరావు మద్రాస్‌ ప్రెసిడెన్సీ కళాశాలలో గోల్డ్మెడల్‌ సాధించారు. ప్రముఖ పారిశ్రామిక వేత్త రామ్మూర్తిశెట్టి ఈపాఠశాలకు చెందిన వారే. ఐఏఎస్‌ అధికారులుగా పని చేసిన వారిలో ఆవుల చెంగప్ప, మునివెంకటప్ప, కుర్రా రామిరెడ్డి ఉన్నారు. ఐపీఎస్‌ అధికారి గురునాథరావు, మాజీ అడ్వకేట్‌ జనరల్‌గా ఆర్‌. వేణుగోపాలరెడ్డి, వెల్లాల శ్రీకంటయ్య, పుంగనూరు తొలి ఎమ్మెల్యే బాడాల కృష్ణమూర్తి ఈ పాఠశాలలో చదివినవారే. అలాగే రామకృష్ణయ్యశెట్టి ఐపిఎస్‌, ఆర్‌. రఘోత్తమరావు ఐఏఎస్‌ ఈ పాఠశాలలో చదివారు. ఇలాంటి వారెందరికో చదువు చెప్పిన పాఠశాల నేడు సాయం కోసం ఎదురుచూస్తోంది.

రచయితలు ….

బసవరాజ కళాశాలలో విద్యాభ్యాసం అభ్యసించిన పుంగనూరు నియోజకవర్గ తొలి ఎమ్మెల్యే, తామ్రపత్ర గ్రహిత బడాల క్రిష్ణమూర్తి కౌటిల్యున్ని అర్థశాన్ని తెలుగులోనికి అనువధించారు. ఈ పుస్తకాని మాజీ ప్రధాని పివి. నరసింహారావుకు అంకితం ఇచ్చారు. అలాగే కవి పండితులు కెఎన్‌. మురళిధర్‌ ఉత్తమ ఉపాధ్యాయుడుగా రాష్ట్రపతి అవార్డును మాజీ రాష్ట్రపతి అబ్ధుల్‌కలామ్‌ చేతులు మీదుగా స్వీకరించారు. వక్కంతం సూర్యనారాయణరావు సీనికవి రచయితగా నంది అవార్డు పొందారు. ఇలాంటి ప్రముఖులెందరికో బసవరాజ కళాశాల మార్గదర్శకంగా నిలిచింది.

 

Tags: Punganur Basavaraja College has 142 years of history- Minister Peddireddy’s efforts

Post Midle