Natyam ad

పుంగనూరు సీఐ గంగిరెడ్డికి ముస్లిం నేతల సన్మానం

పుంగనూరు ముచ్చట్లు:

రాష్ట్రసేవా పథకం పొందిన పట్టణ సీఐ గంగిరెడ్డిని గురువారం రాత్రి ముస్లిం మైనార్టీ నాయకులు ఘనంగా సన్మానించారు. పట్టణ వైఎస్సార్‌సీపీ మైనార్టీ కార్యదర్శి అయూబ్‌ఖాన్‌, మైనార్టీల నాయకులు మస్తాన్‌, అమ్ము, క్షత్రియ సంఘ నాయకుడు నరేంద్రరాజు, ఎరుకుల సంక్షేమసంఘ కార్యదర్శి ఎం.బాబు, షామీర్‌, జలీల్‌, జాబీర్‌, జాఫర్‌లు కలసి పూలమాలలు వేసి శాలువకప్పి సన్మానించారు. ఈ సందర్భంగా పట్టణంలో శాంతిభద్రతలు, కరోనా సేవలు అందించడంలో సీఐ చేసిన కృషిని ముస్లింలు కొనియాడారు.

Post Midle

Tsgs: Punganur CI Gangireddy honored by Muslim leaders

Post Midle

Leave A Reply

Your email address will not be published.