Natyam ad

పుంగనూరు అభివృద్ధి పరుగు

– పట్టణాలుగా జగనన్న కాలనీలు
-రూ.6 కోట్లతో సోలార్‌ ప్రాజెక్టు.
-బైపాస్‌రోడ్లు ఏర్పాటు.

పుంగనూరు ముచ్చట్లు:

Post Midle

ముప్పె ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోని పుంగనూరులో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అభివృద్ధి పరుగులు తీస్తోంది. రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డిల సొంత నియోజకవర్గంలో జగనన్న కాలనీలు, టిడ్కో గృహాలు అత్యంత సుందరంగా నిర్మించడంతో కాలనీలు పట్టణాలుగా మారిపోయింది. ఇప్పటి వరకు 12,196 మంది లబ్దిదారులకు జగనన్నకాలనీలలో పక్కాగృహలు మంజూరు చేశారు. అలాగే 1536 మందికి టిడ్కో గృహాలు, అందజేశారు. గుడిసెల్లో నివాసం ఉన్న పేద ప్రజలు పక్కా భవనాలోకి నివాసం మారడంతో వారి ఆనందాలకు హద్దులు లేవు.

నిర్మాణాలు…

ప్రభుత్వం విలువైన భూమిని సేకరించి అర్హులైన పేదలందరికి ఒకటన్నర సెంటు భూమిని కేటాయించింది. వీరికి ఇంటి నిర్మాణాలకు రూ.1.80 లక్షలు మంజూరు చేశారు. లబ్ధిదారులకు అవసరమైన ఇసుక, సిమెంటు , స్టీలు పంపిణీ చేశారు. అలాగే కాలనీలలో రోడ్లు, విద్యుత్‌ దీపాలు, ఓవర్‌హెడ్‌ ట్యాంకులు నిర్మించి, పైపులైన్లు ఏర్పాటు చేశారు.

అభివృద్ధి పరుగులు……

పుంగనూరు పట్టణం విస్తరించేందుకు వీలుగా భీమగానిపల్లె నుంచి అరబిక్‌ కళాశాల వరకు 7 కిలో మీటర్ల బైపాస్‌ రోడ్డును రూ.256 కోట్లతో ఏర్పాటు చేసి, పట్టణ ట్రాఫిక్‌ను తగ్గించారు. అలాగే రూ.52 కోట్లతో పట్టణంలోని ఎంబిటి రోడ్డును విస్తరించి , ఎల్‌ఈడి దీపాలు ఏర్పాటు చేసి, సుందర పట్టణంగా ఏర్పాటు చేశారు. ప్రజల మానసిక ఉల్లాసం కోసం రూ.3 కోట్లతో 6 పార్కులను ఏర్పాటు చేశారు. మున్సిపాలిటిలో విద్యుత్‌ను ఆదా చేసేందుకు రూ.6 కోట్లతో సోలార్‌ ప్రాజెక్టు నిర్మించారు. ముప్పె ఏళ్లుగా ప్రారంభానికి నోచుకోని ఆర్టీసి డిపోను ప్రారంభించారు. రూ.4 కోట్లతో పట్టణంలో మిని బైపాస్‌రోడ్డు ఏర్పాటు చేశారు. ప్రజలకు తాగునీరు-సాగునీరు అందించేందుకు రూ.1200 కోట్లతో నేతిగుట్లపల్లె, ఆవులపల్లెలో మూడన్నర టిఎంసీల నీటిని నిల్వ చేసే రిజర్వాయర్ల నిర్మాణాలు చేపట్టారు. రూ.120 కోట్లతో 29 విద్యుత్‌ సబ్‌స్టేషన్లు ఏర్పాటు చేశారు. వాటర్‌గ్రిడ్‌ పథకం క్రింద ఇంటింటికి కొళాయిల ద్వారా మంచినీటిని సరఫరా చేసే కార్యక్రమం చేపట్టారు. జలజీవన్‌ మిషన్‌ క్రింద రూ.60 కోట్లతో 270 ఓవర్‌ హెడ్‌ ట్యాంకులను నిర్మించారు. కర్నాటక సరిహద్దులో గల జాతీయ రహదారిని పుంగనూరు నియోజకవర్గం రొంపిచెర్ల వరకు అనుసంధానం చేశారు.

చింత తీర్చిన జగనన్న ప్రభుత్వం…

నేను, నాభర్త కూలీ పనులు చేసినా ఇల్లు నిర్మించుకోవాలన్న కోరిక తీరలేదు. ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో నాకు టిడ్కో ఇల్లు ఇచ్చారు. పుంగనూరులో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి మరువలేం. జగనన్నకే మా ఓట్లు.

– ఎం.రత్నమ్మ, లబ్ధిదారు. పుంగనూరు.

ఇల్లు కట్టుకోలేకపోయాం…

నాభర్త మే పని చేస్తూ అందరి గృహాలు నిర్మిస్తున్నాడు. కానీ మా సొంతఇల్లు కట్టుకోలేకపోయాం. చాలిచాలని డబ్బులతో జీవిస్తున్నాం. ఇలాంటి సమయంలో జగనన్న ప్రభుత్వం రావడంతో మాకు ప్రభుత్వం ఇల్లు నిర్మాణానికి నిధులు ఇచ్చింది. అలాగే కాలనీలో రోడ్లు, మంచినీరు, విద్యుత్‌ ఏర్పాటు చేశారు. పుంగనూరులో రోడ్లు విస్తరించి ఎల్‌ఈడీ దీపాలు ఏర్పాటు చేశారు. ఏ ప్రభుత్వము ఇంత అభివృద్ధి చేపట్టలేదు.

 

– కె.లలిత, లబ్ధిదారు. పుంగనూరు.

రూపురేఖలు మారింది….

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో పుంగనూరు రూపురేఖలు మారింది. అలాగే మాజీవితాల్లో వెలుగులు నింపారు. అమ్మ ఒడి, పక్కాగృహాలు, రుణమాఫి మహిళలకు అందజేసి మాకు అండగా నిలిచిన జగనన్న చిరకాలం ముఖ్యమంత్రిగా ఉండాలి.

– రమ్య, లబ్ధిదారు, పుంగనూరు.

 

     

Tags: Punganur development run

Post Midle