సిరికల్చర్ కమిషనర్‌ను కలసిన పుంగనూరు ఉద్యోగులు
పుంగనూరు ముచ్చట్లు:
పుంగనూరులోని వివిధ సచివాలయాలలో పని చేస్తున్న ఉధ్యానవనశాఖ కార్యదర్శులు, సంఘ నాయకులు కలసి కమిషనర్ శ్రీధర్‌ను విజయవాడలో మంగళవారం కలిశారు. రాష్ట్ర అధ్యక్షుడు కమ్మన్న, కార్యదర్శి రవీంద్రనాథ్, చిత్తూరు జిల్లా అధ్యక్షుడు పద్మశేఖర్ కలసి ఉద్యోగుల సమస్యల పదోన్నతులపై వినతిపత్రం అందజేశారు. అలాగే అడిషినల్ జాయింట్ డైరెక్టర్ అరుణకుమారిని కలసి సమస్యలు పరిష్కరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు నవీన్బాబుశర్మ, శ్రీనివాసులు, కరుణాకర్,లీలావతి పాల్గొన్నారు.
Tags: Punganur employees who met the Commissioner of Culture