సచివాలయ సేవల్లో పుంగనూరు ఫస్ట్

– 6గంటల్లో రేషన్‌కార్డు
– 8,465 సమస్యలు పరిష్కారం
– కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Date:18/09/2020

పుంగనూరు ముచ్చట్లు:

Punganur First in Secretariat Services
Punganur First in Secretariat Services

ప్రభుత్వం నిర్ధేశించిన మేరకు ప్రజలకు సేవలు అందించి, ఆన్‌లైన్‌ ద్వారా పరిష్కారంలో పుంగనూరు మున్సిపాలిటిలో జిల్లాలో అగ్రస్థానంలో నిలిచిందని కమిషనర్‌ కెఎల్‌.వర్మ తెలిపారు. శుక్రవారం మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ కొండవీటి నాగభూషణంతో కలసి ఆయన జయమ్మకు రేషన్‌కార్డు అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ పట్టణంలోని 10వ సచివాలయంకు చెందిన జయమ్మ అనే మహిళ ఉదయం రేషన్‌కార్డుకు ధరఖాస్తు చేయగా , రెవెన్యూ అధికారుల సహకారంతో 6 గంటలలోపు కార్డును సచివాలయ కార్యదర్శి వనజ, వీఆర్‌వో హిమగిరి, వలంటీర్‌ కార్తీక్‌విజయ్‌ కలసి మంజూరు చేయించడం జరిగిందన్నారు. అలాగే పట్టణంలోని 16 సచివాలయాలలోను ఫిబ్రవరి 1 నుంచి ప్రజా సేవలను నిర్ధేశించిన గడువులో పరిష్కరించాలని ప్రభుత్వం ఆదేశించిందన్నారు. ఈ మేరకు ఇప్పటి వరకు 10,082 అర్జీలు రావడం జరిగిందన్నారు. ఇందులో 8,465 అర్జీలను పరిష్కరించడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఆశించిన గ్రామస్వరాజ్య పాలనలో సంబంధిత మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గ కేంద్రంలో సంపూర్ణంగా సచివాలయ పాలన కొనసాగిస్తూ, జిల్లాలో ఆదర్శంగా నిలిచామన్నారు. సచివాలయ పాలనలో సంపూర్ణ సహకారం అందిస్తున్న జిల్లా కలెక్టర్‌, సచివాలయాల జేసి తో పాటు సచివాలయ ఉద్యోగులకు, వలంటీర్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

నానబాలవీధి ఫస్ట్….

పట్టణంలోని నానబాలవీధిలోని 8వ సచివాలయంలో 13,03 సమస్యలు ఆన్‌లైన్‌ ద్వారా నమోదు కాబడిందన్నారు. వీటిలో 1011 సమస్యలను పరిష్కరించడం జరిగిందన్నారు. పట్టణంలోని 16 సచివాలయాలల్లో 8వ సచివాలయంలో అడ్మీన్‌ సెక్రటరీ నోముకుమార్‌ ఆధ్వర్యంలో సచివాలయ కార్యదర్శులు, వలంటీర్లు ఉత్తమ సేవలు అందించి ఆగ్రస్థానంలో నిలిపారని కొనియాడారు.

బాలిక అదృశ్యం… విషాదాంతం

Tags: Punganur First in Secretariat Services

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *