పుంగనూరు ప్రభుత్వ వైద్యశాలలో కత్తెరకు కళ్లెం
పుంగనూరు ముచ్చట్లు:
సాధారణంగా మహిళలకు ప్రసవాల సమయంలో ఏదోసాకు చెప్పి సర్జరీలు చేసి ప్రసవం చేయడం అలవాటుగా మారింది. కానీ అలాంటి వాటికి చెక్‌పెట్టి కత్తెర్లను పక్కన పెట్టి స్థానిక ప్రభుత్వాసుపత్రిలో డాక్టర్లు అత్యంత చాకచక్యంగా ఒక మహిళకు ప్రసవం చేసి శబాష్ అనిపించుకుంటున్న సంఘటన శుక్రవారం పుంగనూరు ఆసుపత్రిలో జరిగింది. వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని రాంరహీమ్‌వీధిలో నివాసం ఉన్న రేష్మాతాజ్ అనే మహిళకు ప్రసవ నొప్పులు ప్రారంభమైంది. ఈ విషయాన్ని మెడికల్ ఆఫీసర్ జశ్వంత్, గైనకాలజిస్ట్ చందన లు పరిశీలించి ఒక పద్దతి ప్రకారం ఆమెకు చికిత్సలు నిర్వహించి, ఎలాంటి ఇబ్బందులు లేకుండ రేష్మాతాజ్‌కు ప్రసవం చేశారు. కాగా 4.47 కేజిల బరువు గల పాపకు ఆమె జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లిబిడ్డ క్షేమంగా ఉన్నారు. ఈ కార్యక్రమంలో నర్సులు అనిత, భార్గవి పాల్గొన్నారు. కాగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత స్థానిక ప్రభుత్వాసుపత్రిలో అన్ని రకాల వైద్యులను నియమించి చికిత్సలు అందించడంతో పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై డాక్టర్ జశ్వంత్ మాట్లాడుతూ పాప పెరుగుదల ఎక్కువుగా ఉందని , కానీ సర్జరీ లేకుండ సుఖ ప్రసవం చేయడం జరిగిందన్నారు.

Tags; Punganur Govt Hospital Scissors
