పుంగనూరు పదవ తరగతి పరీక్షల్లో 582 మార్కులు సాధించిన యోగితకు సన్మానం

పుంగనూరు ముచ్చట్లు:

పదవ తరగతి పరీక్షల్లో 600 మార్కులకు గాను 582 మార్కులు సాధించిన జెడ్పిహైస్కూల్‌ విద్యార్థినీ యోగితకు ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ నాగరాజారెడ్డి, జెడ్పిటిసి జ్ఞానప్రసన్న కలసి శుక్రవారం సన్మానం చేశారు. మండలంలోని కొత్తపల్లె గ్రామానికి చెందిన రైతు బి.భార్గవరెడ్డి కుమారై పట్టణంలోని జెడ్పిబాలికల హైస్కూల్‌లో పదవ తరగతి చదివింది. ఈ సందర్భంగా యోగితకు శ్యాలువకప్పి సన్మానం చేశారు. ఎంపీపీ భాస్కర్‌రెడ్డి రూ.5 వేలు, వైఎస్సార్‌సీపీ నాయకుడు కొత్తపల్లె చెంగారెడ్డి కలసి రూ.10 వేలను ఆబాలికకు బహుమతిగా అందజేశారు. బాలిక ఉన్నత చదువులు చదివేందుకు ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని, అవసరమైతే తాము కూడ ఆబాలిక ఉన్నత చదువులకు సహకారం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో కేశవరెడ్డి, ఎంపీడీవో లక్ష్మీపతి, తహశీల్ధార్‌ వెంకట్రాయులు తదితరులు పాల్గొన్నారు.

 

Tags: Punganur honors Yogi who scored 582 marks in Class X examinations

 

Leave A Reply

Your email address will not be published.