పాడిఆవులకు ప్రసిద్దిగాంచిన పుంగనూరు

Punganur is famous for dairy farms

Punganur is famous for dairy farms

Date:20/07/2019

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు మండలం పాడి ఆవులకు ప్రసిద్దిగాంచినది. అనేక సంవత్సరాల నుంచి పాడి ఆవులు వ్యవసాయంకోసం ఎద్దులు కోసం రాష్ట్రం నుంచే కాకుండ ఇతర ర్ఖా•ల నుంచి రైతులు కొనుగోలు చేసేందుకు పుంగనూరుకు వస్తుంటారు. అందుచేతనే పుంగనూరులో ప్రతి మంగళ, బుధవారాలలో పశువుల సంత గొప్పగా జరుగుతోంది. అలాగే సంవత్సరంలో ఒక సారి నెల రోజుల పాటు పూర్వం నుంచి గొప్ప పశువుల సంత నేటికి నిర్వహిస్తున్నారు. ఈ సంతలో పశువులు కొనుగోలు, అమ్మకాలకు కర్నాటక , తమిళనాడు తదితర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో వ్యాపారులు, రైతులు ఈ సంతలకు వస్తుంటారు. ఇప్పటికి పుంగనూరు ఎద్దల పరష అంటే ఓ ప్రత్యేకత సంతరించుకుంది. గతంలో నాటిఆవులు అధికంగా ఉండేవి. కాల క్రమేణ సంకరజాతి పాడి ఆవులు, హెచ్‌ఆఫ్‌, జెర్సీ, హ్గలిస్టన్‌, సింధి, షాహివాల్స్జెర్సీ జాతీకి చెందినవి రావడంతో వీటిపై మండలంలో వ్యాపారస్తులు దృష్టి సారించి అధిక శాతం అభివృద్ధి చేస్తున్నారు. ఈ జాతికి చెందిన పాడి ఆవులు చాలా సున్నితంగా ఉంటాయి. కనుక అధిక ఎండ వేడిమిని తట్టుకోలేవు.

అధిక ధ రలు, పాలు ….

పుంగనూరు ప్రాంతంలో సంకరజాతికి చెందిన పాడి పశువులు అభివృద్ధి చెందడానికి వాతావరణ అనుకూలంగా ఉండటమే ఇందుకు కారణం. ఈ జాతికి చెందిన హెచ్‌ఎఫ్‌ పాడి ఆవు సుమారు రూ. 2లక్షల వరకు ఉంటుంది. అలాగే పుంగనూరు జాతి ఆవు రూ.4 లక్షలు ధర పలుకుతోంది. వీటి ద్వారా పాలదిగుబడి సుమారు 20 నుంచి 30 లీటర్ల వరకు రెండు పూటల ఇవ్వడంతో రైతులు ఆసక్తితో వీటిపై వెహోగ్గుచూపారు. అయితే గ్రామీణ ప్రాంతాలలో తక్కువ ఖర్చుతో పాడి ఆవుల పోషణ తక్కువ కావడం, ఆదాయం ఎక్కువుగా ఉండటంతో పాడి పరిశ్రమ అధిక స్థాయిలో జరుగుతోంది. ఇక్కడి పాడి ఆవులు ప్రసవించిన 40 రోజులకు ఇంజక్షన్‌ ద్వారా తిరిగి గర్భం దాల్చే విధంగా చేయడం జరుగుతోంది. ప్రసవించినప్పటి నుంచి సుమారు 8 నెలల పాటు గర్భంలో దూడ పెరుగుతున్నా , పాలు దిగుబడి వస్తు ఉంటుంది. అందుచేత ఎక్కువ మంది రైతులు పుంగనూరు ఆవులను కొనుగోలు చేస్తారు.

ఇతర ర్ఖా•లకు ఎగుమతి…

పుంగనూరు పాడి ఆవులను బయట రాష్ట్రాల వ్యాపారులు వచ్చి కొనుగోలు చేసి తీసుకెళ్తారు. తెలంగాణ, కోస్తా, అనంతపురం , కడప , మధ్యప్రదేశ్‌, జగదల్‌పూర్‌, చతీష్‌గడ్‌, రాయపూర్‌, కర్నాటక రాష్ట్రంలోని మాండ్య, బళ్ళారి, మైసూర్‌, దావణగిరి, హుబ్లీ, చెన్నై, తదితర పొరుగు ర్ఖా•ల నుంచి రైతులు ఎక్కువ సంఖ్యలో కొనుగోలుకు వస్తుంటారు. అంతేకాక ఇక్కడి నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం , అలివేలు మంగాపురంలోని భీమాస్‌ , మయూరిడైరీ, వైజాగ్‌ విశాఖ డైరీలకు విశేషంగా పాడి ఆవులను కొనుగోలు చేస్తుంటారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌. రాజశేఖర్‌రెడ్డి ఇడుపుల పాయలో ఉన్న ఫాంహౌస్‌కు నాడు వైఎస్‌ఆర్‌కు అతి ప్రీతిపాత్రమైన షాహివాల్‌ జెర్సీ జాతికి చెందిన 30 దూడలు, 30 పాడి ఆవులను ఇక్కడి నుంచి ఎగుమతి చేయడం చాలా విశేషం. ఈ పాడి ఆవులు ఎర్రమట్టి రంగును పొలి ఉంటాయి.

మా పెద్దల నుంచి ఇదే వ్యాపారం ………….

మా పెద్దల కాలం నుంచి అందరు పాడి ఆవుల వ్యాపారం చేస్తున్నారు. ఇరవై సంవత్సరాలుగా నేను ఇదే వ్యాపారంలో ఉన్నాను. ఇతర రాష్ట్రాల నుంచి మాపై నమ్మకంతో కొనుగోలు చేసేందుకు వచ్చే రైతులకు మంచి జాతి ఆవులను అమ్ముతుంటాము. గతంలో ఇడుపుల పాయలోని వైఎస్‌ఆర్‌ పౌల్డ్రిఫాంకు అతిప్రితిపాత్రమైన షాహివాల్‌ పాడి ఆవులను అందించడం మరువలేని అనుభూతి. అందుచేత రైతులకు ఈ ఊరి మీద , వ్యాపారుల మీద ఆపార నమ్మకం ఉంది కాబట్టిపాడి ఆవులకు ప్రసిద్దిగా మారింది.

– ఆవుల అమరేంద్ర, వ్యాపారి, పుంగనూరు

నమ్మకంతోనే వ్యాపారం ..

పాడి ఆవుల వ్యాపారం నమ్మకంతోనే కొనసాగుతోంది. దీనికి తోడు దూర ప్రాంతాల నుంచి కొనుగోలుకు వచ్చే రైతులకు నచ్చిన జాతి ఆవులను తెలుసుకుని వాటి దిశగా దూడలను పెంచి వారికి అందించడం పుంగనూరు వ్యాపారుల ప్రత్యేకత. పొరుగు రాష్ట్రాలలో పుంగనూరు ఆవులకు ఉన్న డిమాండు ఎక్కడ లేదు.

– అజీజ్‌సాహెబ్‌ ,వ్యాపారి, పుంగనూరు

వలంటీర్ల నియామకాలకు ఇంటర్వ్యూలు

Tags; Punganur is famous for dairy farms

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *