Natyam ad

పుంగనూరు ఆదర్శవంతంగా లయన్స్ క్లబ్‌ సేవలు

పుంగనూరు ముచ్చట్లు:

అన్ని రకాల వారికి సేవలు అందిస్తూ లయన్స్ క్లబ్‌ ఆదర్శంగా నిలుస్తోందని లయన్స్ క్లబ్‌ జిల్లా గవర్నర్‌ వినూతప్రకాష్‌ తెలిపారు. ఆదివారం రాత్రి లయన్స్ క్లబ్‌ సమావేశాన్ని జిల్లా ప్రాజెక్టు మేనేజర్‌ డాక్టర్‌ శివ ఆధ్వర్యంలో అధ్యక్ష, కార్యదర్శులు శ్రీరాములు, ఈశ్వరమ్మ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధులుగా వెహోదటి గవర్నర్‌ డాక్టర్‌ రామారాజఅర్స్, రెండవ గవర్నర్‌ చంద్రహెచ్‌రెడ్డి, క్యాబినెట్‌ సెక్రటరీ జ్యోతిరామ్‌లు హాజరైయ్యారు. ఈ సందర్భంగా లయన్స్క్లబ్‌ ద్వారా నిర్మించిన డయాలసిస్‌ సెంటర్‌లో రోగులకు అందిస్తున్న సేవలను వివరించారు. అలాగే ఉచిత కంటి వై ద్యశిబిరాలు, రక్తదాన శిబిరాలు గురించి వివరించారు. వినూతప్రకాష్‌ మాట్లాడుతూ లయన్స్ క్లబ్‌ పుంగనూరు వారు ఆదర్శంగా సేవలు అందిస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమాలను ఇలాగే మరింతగా విస్తత పరచాలని ఆకాంక్షించారు. క్లబ్‌లోసేవలు అందించిన వారికి మెమెంటోలు అందజేసి, సన్నానం చేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్‌ ప్రతినిధులు గోపాలకృష్ణ, పిఎల్‌.శ్రీధర్‌, ముత్యాలు, అమరావతి సురేష్‌ తో పాటు పలువురు క్లబ్‌ సభ్యులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: Punganur is ideally served by the Lions Club

Post Midle