Punganur is the number one priority in sanitation masots in schools

పాఠశాలల్లో పారిశుద్ధ్య మాసోత్సవాలలో పుంగనూరుకు మొదటిస్థానం

– ఉత్తర్వులు పంపిన డీఎంఏ
– మంత్రి పెద్దిరెడ్డి అభినందనలు

Date:21/01/2020

పుంగనూరు ముచ్చట్లు:

మున్సిపాలిటి పరిధిలోని పాఠశాలల్లో నిర్వహించిన పారిశుద్ధ్య మాసోత్సవాల పోటీలలో పుంగనూరు మున్సిపాలిటి రాష్ట్రంలో ప్రథమస్థానాన్ని కైవసం చేసుకుంది. మంగళవారం సాయంత్రం డీఎంఏ విజయకుమార్‌ ఉత్తర్వులు పంపారు. విషయం తెలిసిన వెంటనే మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మున్సిపల్‌ కమిషనర్‌ను, సిబ్బందిని, ఉపాధ్యాయులను, కార్మికులను అబినందించారు. ఈ విషయమై కమిషనర్‌ కెఎల్‌.వర్మ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 59 మున్సిపాలిటిలలోని పాఠశాలల్లో నవంబర్‌ 14 నుంచి డిసెంబర్‌ 14 వరకు పారిశుద్ధ్య మాసోత్సవాలను నిర్వహించామన్నారు. ఈకార్యక్రమాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌ ద్వారా మున్సిపల్‌ పరిపాలన విభాగం నుంచి సచివాయలంలోని కమెండ్‌కంట్రోల్‌ సెంటర్‌ పంపడం జరిగిందన్నారు. దీనిపై సచివాలయం నుంచి ప్రత్యక్ష వీడియో వీక్షణ ద్వారా ప్రతి రోజు పరిశీలనను చేపట్టారు. ఇందులో బాగంగా కార్పోరేషన్ల విభాగంలో తిరుపతి కార్పోరేషన్‌కు రాష్ట్ర స్థాయిలో ప్రథమస్థానం, మున్సిపల్‌ విభాగంలో పుంగనూరు మున్సిపాలిటికి ప్రథమస్థానం లభించింది. ఈ మేరకు డిఎంఏ విజయకుమార్‌ మున్సిపల్‌ కమిషనర్‌ వర్మను, ఉపాధ్యాయులను అభినందించారు.

Punganur is the number one priority in sanitation masots in schools
Punganur is the number one priority in sanitation masots in schools

నూతనమెనుతో కూడిన మధ్యాహ్న భోజనం పంపిణీ

Tags: Punganur is the number one priority in sanitation masots in schools

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *