Natyam ad

పుంగనూరు లోక్‌అదాలత్‌లో 205 కేసులతో పాటు రూ.76.07 లక్షలు పరిష్కారం

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని సీనియర్‌ సివిల్‌జడ్జి కోర్టులో జాతీయ లోక్‌అదాలత్‌ను సీనియర్‌ సివిల్‌జడ్జి వాసుదేవరావు, అడిషినల్‌ జూనియర్‌ సివిల్‌జడ్జి సిందు కలసి శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా 205 సివిల్‌, క్రిమినల్‌ కేసులు పరిష్కరించారు. వీటి ద్వారా కక్షిదారులకు రూ.76.07 లక్షలు పరిష్కారం చేశారు. వీటితో పాటు ఎస్టీసి కేసులు 525 పరిష్కరింషచారు. న్యాయమూర్తి వాసుదేవరావు మాట్లాడుతూ అందరి సహకారంతో లోక్‌అదాలత్‌లో కేసులు పరిష్కరించడం జరిగిందన్నారు. లోక్‌అదాలత్‌ తీర్పులపై అప్పీల్‌ ఉండదని తెలిపారు. ప్రజలు తమ సమస్యలను పరిష్కరించుకునేందుకు లోక్‌అదాలత్‌ను వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదుల సంఘ అధ్యక్షుడు విజయకుమార్‌, న్యాయవాదులు బాలాజికుమార్‌ , వెంకటమునియాదవ్‌, చెన్నకేశవులు తదితరులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: Punganur Lok Adalat settles 205 cases and Rs.76.07 lakhs

Post Midle