అగ్ని ప్రమాదంలో పుంగనూరు వ్యక్తి మృతి
పుంగనూరు ముచ్చట్లు:
పుంగనూరు మండలం సింగిరిగుంట పంచాయతీ మార్లపల్లెలోని ఓ ఇంట్లో సోమవారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగింది. నిరంజన్ అనే వ్యక్తి చనిపోయినట్లు స్టేషన్ ఫైర్ ఆఫీసర్ సుబ్బరాజు తెలిపారు. దోమల నివారణ కాయిల్ ద్వారా మంటలు వ్యాపించినట్లు తెలుస్తోంది. మతిస్థిమితం లేని కారణంగా నిరంజన్ మృతి చెందాడు. ఇంట్లోని వస్తువులు అగ్నికి ఆహుతి అయ్యాయి. మృతదేహాన్ని స్థానిక పోలీసులకు అప్పగించారు.

Tags: Punganur man dies in fire accident
