పుంగనూరు ఎంపీపీ అభ్యర్థి అక్కిసాని భాస్కర్‌రెడ్డి జన్మదిన వేడుకలు

Date:04/12/2020

పుంగనూరు ముచ్చట్లు:

వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి , పుంగనూరు మండల ఎంపీపీ అభ్యర్థి అక్కిసాని భాస్కర్‌రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. భాస్కర్‌రెడ్డి జన్మదిన సందర్భంగా ఆయన అభిమానులు ఆలయాలలో పూజలు చేసి, కేక్‌ కట్‌ చేసి , సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా పట్టణంలో, గ్రామాల్లో ప్లెక్సిలు ఏర్పాటు చేసి శుభాకాంక్షలు తెలిపారు. మున్సిపల్‌ కమిషనర్‌ కెఎల్‌.వర్మ ఆధ్వర్యంలో మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ కొండవీటి నాగభూషణం, ఏఎంసీ చైర్మన్‌ నాగరాజారెడ్డి, ఆర్టీసి మజ్ధూర్‌ సంఘ అధ్యక్షుడు జయరామిరెడ్డి, పార్టీ జిల్లా కార్యద ర్శి చంద్రారెడ్డి యాదవ్‌ ,
మంత్రి పిఏ మునితుకారాం కలసి భాస్కర్‌రెడ్డికి శాలువకప్పి సన్మానించారు. కేక్‌ కట్‌ చేసి, సంబరాలు చేసుకున్నారు. అలాగే మండల కార్యాలయంలో మండల కార్యదర్శులు స్యుధాకర్‌ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు నిర్వహించారు. అలాగే భాస్కర్‌రెడ్డి మిత్ర బృందం అయూబ్‌ఖాన్‌ ఆధ్వర్యంలో స్నేహితులు సంబరాలు నిర్వహించారు. వర్తక వ్యాపారుల సంఘం, చాంబర్‌ ఆఫ్‌ కామర్స్ సంఘ ప్రతినిధులు వెంకటాచలపతిశెట్టి, అర్షద్‌అలి, భానుప్రకాష్‌ ఆధ్వర్యంలో కేక్‌ కట్‌ చేసి జన్మదిన వేడుకలు నిర్వహించారు. అలాగే ఎంఈవో కేశవరెడ్డి , డిప్యూటి తహశీల్ధార్‌ మాదవరాజు ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు, అధికారులు జన్మదిన వేడుకలు నిర్వహించారు. వీరితో పాటు సింగిరిగుంట, ఆరడిగుంట, మంగళం తదితర గ్రామాల్లో జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో భాస్కర్‌రెడ్డి అభిమానులు రాజశేఖర్‌రెడ్డి, చందు, రాజేష్‌, సురేష్‌, రవిచంద్రశెట్టి, శ్రీనివాసులరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

  

పొడుగు పాడు గ్రామ పంచాయతీని పరిశీలించిన డి పి ఓ

 

Tags: Punganur MPP candidate Akkisani Bhaskarreddy’s birthday celebrations

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *