పుంగనూరు మున్సిపల్ కార్మికుల నిరసన
పుంగనూరు ముచ్చట్లు:
పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద ఏఐటియుసి కార్యదర్శి వెంకట్రమణారెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం మున్సిపల్ కార్మిక సంఘ నాయకులు నాగయ్య, రెడ్డెప్ప, రెడ్డెమ్మ, రాజు కలసి నిరసన తెలిపారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని, మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కమిషనర్ నరసింహప్రసాద్కు వినతిపత్రం సమర్పించారు.

Tags: Punganur Municipal Workers’ Protest
