పుంగనూరు మున్సిపాలిటీకి జాతీయస్థాయిలో స్వచ్ఛ సర్వేక్షణ అవార్డ్

పుంగనూరు ముచ్చట్లు:

రాష్ట్ర మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత నియోజకవర్గ కేంద్రమైన పుంగనూరు మున్సిపాలిటీకి స్వచ్ఛ సర్వేక్షణలో జాతీయ అవార్డు లభించింది. జాతీయ అవార్డులను కేంద్ర ప్రభుత్వం శుక్రవారం రాత్రి విడుదల చేసింది .ఇందులో భాగంగా పుంగనూరు, తిరుపతి ,విశాఖపట్నం తదితర మున్సిపాలిటీలకు కార్పోరేషన్లకు ఆరు అవార్డులు లభించింది.ఈ సందర్భంగా కమిషనర్ నరసింహ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎంపీ మిథున్ రెడ్డి ల సహకారంతో మున్సిపాలిటీని అన్నివిధాలా అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. మున్సిపల్ చైర్మన్ అలీంబాషా ఆధ్వర్యంలో పాలక వర్గ సభ్యులు ప్రజలు అందించిన సహకారం మరువలేనిదన్నారు .జాతీయ అవార్డు రావడం పుంగనూరు ప్రజల అదృష్టమన్నారు .పాలకవర్గ సభ్యులు పట్టణ ప్రముఖులు ప్రజలు ఇదేవిధంగా మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాలని కోరారు.

Tags: punganur municipality aword

Leave A Reply

Your email address will not be published.