Natyam ad

మంత్రి పెద్దిరెడ్డిని కలసిన పుంగనూరు ముస్లిం మైనార్టీ నాయకులు

పుంగనూరుముచ్చట్లు:

రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని బుధవారం ముస్లిం మైనార్టీ నాయకులు కలిశారు. మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా, అంజుమన్‌ నూతన కమిటి అధ్యక్షుడు ఎంఎస్‌.సలీం, రాష్ట్రజానపదకళల సంస్థ అధ్యక్షుడు కొండవీటి నాగభూషణం ఆధ్వర్యంలో సుమారు 200 మంది ముస్లింలు మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా మంత్రి అంజుమన్‌ కమిటి ప్రతినిధులకు శాలువకప్పి సన్మానించారు. ముస్లిం మైనార్టీల అభివృద్ధికి అన్ని విధాల సహకరిస్తామని మంత్రి తెలిపారు. ఏ సమస్య వచ్చినా తమకు తెలియజేయాలని కోరారు. మంత్రిని కలిసిన వారిలో మైనార్టీ నాయకులు షా, అజీజ్‌సాహెబ్‌, ఇబ్రహిం, ఇస్మయిల్‌, ఆరీపుల్లా, జబీర్‌, జాఫర్‌, అఫ్సర్‌, మన్సూర్‌ తదితరులు పాల్గొన్నారు.

Post Midle

 

Tags: Punganur Muslim minority leaders who met Minister Peddireddy

Post Midle

Leave A Reply

Your email address will not be published.