పుంగనూరు కవులను సన్మానించిన ఎస్సి ఎస్టీ మానిటరింగ్ సభ్యులు..
పుంగనూరు ముచ్చట్లు:
సాహితీవేత్తలు గా కవులు రచయితలు గా పుట్టిన ఊరు పుంగనూరు వాసులకి మంచి గుర్తింపు తో ఉమ్మడి రాష్ర్టాలలో పేరు తీసుకువస్తున్న సరస్వతి పుత్రులయిన రచయిత సాహితీవేత్తలు ఉపాధ్యాయులు పరాంకుశ నాగరాజ,జర్నలిస్టు, న్యాయవాది తల్లా శ్రీనివాస్, జర్నలిస్టు,కవి సాల్వరాజు సతీష్ కుమార్,ఎలాక్ట్రిషన్ ఆవుల పల్లి రెడ్డేప్ప మంచి కవితలను తిరుపతి మహతి వేదికలో కనపరచి వందలాది మంది కవుల,రచయితల ప్రశంసల తో పుంగనూరు పేరు ఖ్యాతి ని చాటినందుకు నేడు అంబేత్కర్ భవనం లో ఎస్సి ఎస్టీ మానిటరింగ్ సభ్యులందరి ఆధ్వర్యం లో సన్మానించారు.ఈ సందర్భంగా ఎస్సి ఎస్టీ సెల్ సభ్యులు మాట్లాడుతూ పుంగనూరు పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెడుతున్న వివిధ క్రీడాకారులు,కళాకారులను ప్రోత్సహిస్తూ అభినందించడం లో ఎంతో సంతోషం ఉన్నదని,ఇలా ఇక రానున్న రోజుల్లో ఎస్సి ఎస్టీ మానటరింగ్ సభ్యులు తరవున మరింత మంది మహానుభావులను సన్మానించుకోవడం జరుగుతుందని తెలిపారు.కార్యక్రమంలో ఘంటసాల పాటల గాయకుడు నూర్ భాషా అందరినీ అలరించారు. అలాగే తల్లా శ్రీనివాస్ జన్మదినం సందర్భంగా ఎస్సి ఎస్టీ మానటరింగ్ సభ్యులు ఆయనను సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.కార్యక్రమంలో ఎస్సి ఎస్టీ మానటరింగ్ సభ్యులు ఎన్. ఆర్. అశోక్, శ్రీనివాసులు, రాజు, నరసింహులు,,నాగరాజ,కృష్ణప్ప, నాగేనాయక్,మున్సిపల్ మాజీ కో ఆప్షన్ నెంబర్ ఖాదర్ భాషా తదితరులు పాల్గొన్నారు.

Tags:Punganur poets honored SC ST monitoring members..
