పుంగనూరును పోస్టర్లు ఫ్రీగా చేయాలి

Punganur posters should be made free

– కమిషనర్‌ వ ర్మ

Date:19/09/2018

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు పట్టణంలో పోస్టర్లు లేని పట్టణంగా చేసేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని మున్సిపల్‌ కమిషనర్‌ కెఎల్‌.వర్మ కోరారు. బుధవారం ఆయన సిబ్బందితో కలసి పట్టణంలోని గోడలపై ఉన్న పోస్టర్లను, ప్లెక్సిలను , బ్యానర్లను తొలగించే కార్యక్రమం చేపట్టారు.

 

ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు న్యాయస్థానాలు, పోస్టర్లు ఫ్రీ పట్టణాలుగా మార్చాలని ఆదేశించిందన్నారు. ఇందులో భాగంగా సినిమా థియెటర్ర్ల యజమానులు, వ్యాపారులు, రాజకీయ నాయకులు ఎక్కడపడితే అక్కడ పోస్టర్లు అంటిచడం చేయరాదన్నారు. ముఖ్యంగా ఈ పోస్టర్లు ద్వారా వాహనచోదకులకు తీవ్ర ఇబ్బంది కలుగుతోందన్నారు.

 

అలాగే అసభ్యకరమైన పోస్టర్లు పట్టణంలో వేయరాదన్నారు. ఏదైనా పోస్టర్లు, ప్లెక్సిలు ఏర్పాటు చేయదలచిన వారు ముందుగా మున్సిపాలిటి అనుమతి పొందాల్సి ఉందన్నారు. ఈ విషయమై ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు. లేకపోతే ఇలాంటి వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

పదోన్నతలు కల్పించాలని వీఆర్‌వోలు ధర్నా

Tags: Punganur posters should be made free

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *