Natyam ad

పుంగనూరు వాసులకు ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం-యువతి మృతి

– 5 మందికి తీవ్ర గాయాలు

పుంగనూరు ముచ్చట్లు:

Post Midle

పట్టణంలోని మేలుపట్లలో నివాసం ఉన్న ఏఐటియుసి కార్యదర్శి వెంకట్రమణారెడ్డి కుమారుడు రాజేష్‌ నాలుగురోజుల క్రితం అదృశ్యమైయ్యాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సెల్‌ఫోన్‌ ఆధారంగా విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. హెడ్‌కానిస్టేబుల్‌ జ్ఞానప్రకాష్‌, కానిస్టేబుల్‌ యల్లప్ప, వెంకట్రమణారెడ్డి , అల్లుడు మోహన్‌రెడ్డి కలసి ఇన్నోవాకారులో విజయవాడకు వెళ్లారు. అదృశ్యమైన రాజేష్‌ తో పాటు నిమ్మనపల్లె మండలం రెడ్డివారిపల్లెకి చెందిన హర్షితను గుర్తించి పుంగనూరుకు తీసుకొస్తుండగా మార్గ మధ్యంలో ప్రకాశం జిల్లా ఏబికుంట వద్ద డ్రైవర్‌ నిద్రమత్తులో డివైడర్‌ను ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో హర్షిత అక్కడిక్కడే మృతి చెందింది. రాజేష్‌, హెడ్‌ కానిస్టేబుల్‌ జ్ఞానప్రకాష్‌ పరిస్థితి విషమంగా ఉంది. యల్లప్ప, వెంకట్రమణారెడ్డి, మోహన్‌రెడ్డి లకు మాత్రం స్వల్పగాయాలతో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు ఛేసి , దర్యాప్తు చేస్తున్నారు.

 

 

 

Tags: Punganur residents killed in road accident in Prakasam district

Post Midle