ఉత్తమ ఉపాధ్యాయుల , సేవరత్న అవార్డులు అందుకున్న పుంగనూరు వాసులు..
పుంగనూరు ముచ్చట్లు:
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా తిరుపతికి చెందిన దైవాస్ షైన్ ఫౌండేషన్ స్వచ్ఛంద సేవా సంస్థ వారు ఆంద్రప్రదేశ్ రాష్ట్రం లో నాలుగు జిల్లాలలోని 25 మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేసుకొని వారితో పాటు వివిధ రంగాలలో ఉత్తమ సేవలందిస్తున్న వారికి షైన్ సేవారత్న అవార్డు లను భాకరాపేట సాయిరాం హైస్కూల్ నందు ఆదివారం సాయంత్రం దైవాన్ షైన్ ఫౌండేషన్ ఫౌండర్ డా.ఠాగూర్ దైవ కటాక్షం, సాయి హైస్కూల్ కరస్పాండెంట్ జనార్దన్,సర్పంచ్ సాకెరీ భూపాల్, రచయిత నారాయణ స్వామి, ఉషోదయా ఫౌండేషన్ వ్యస్థాపకు రాలు కవయిత్రి డా.ధనా శి ఉషారాణీ కార్యక్రమ సమన్వయ కర్తగా వ్యహరించి ఆధ్వర్యంలోకార్యక్రమం నిర్వహించి ఉపాధ్యాయులను,సామాజిక సేవ రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న వారిని సన్మానించి అవార్డులు అందజేయడం జరిగింది.

దైవాస్ షైన్ ఫౌండేషన్ స్వచ్ఛంద సేవా సంస్థ పేదలకు ఉచిత వైద్య సేవ ను అందిస్తూ అనేక ఉచిత మెడికల్ క్యాంపు లు నిర్వహిస్తూ మండల స్థాయిలో ప్రతిభ చాటిన విద్యార్థుల కు ప్రోత్సాహకాలు అందిస్తూ ముందుకు పోతున్నది.ఇందులో చిత్తూరు జిల్లా పుంగనూరు కు చెందిన చౌడేపల్లి మండలం లోని హరిజన వాడ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో పనిచేయుచున్న ప్రధానోపాధ్యాయురాలు గాయత్రీ దేవి, చింతమాకుల పల్లె మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రదనోపాధ్యాయురాలు వహీదా రహమాన్, పుంగనూరు శుభారం డిగ్రీ కళాశాలలో జూనియర్ హిందీ లెక్చరర్ స్రవంతి, ఉత్తమ కవిగా హసీనా బేగం,ఉత్తమ రిపోర్టర్ గా సాల్వరా సతీష్ కుమార్ లు ఈ అవార్డులను అందుకున్నారు.
Tags:Punganur residents who received best teachers and Sevaratna awards..
