పుంగనూరులో 11 నుంచి రోడ్డెక్కనున్న పుంగనూరు ఆర్టీసి బస్సులు

పుంగనూరు ముచ్చట్లు:

 

పుంగనూరు నూతన ఆర్టీసి డిపో నుంచి శుక్రవారం అదనపు బస్సులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్‌ సుధాకర్‌ తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ కరోనా నియంత్రణలో భాగంగా కర్ఫ్యూను సడలించడంతో బస్సులను నడుపుతున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా తిరుపతికి 6 సర్వీసులు, చిత్తూరుకు 4 సర్వీసులు, అనంతపురంకు 3 సర్వీసులు, కడపకు ఒక సర్వీసు, కదిరికి ఒక సర్వీసు నడుపుతున్నట్లు తెలిపారు. కాగా కరోనా నేపధ్యంలో డిపోను ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి గత నెలలో మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కలసి ప్రారంభించారు. ప్రస్తుతం బస్సులు ప్రారంభంకావడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

 

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

Tags: Punganur RTC buses ply on the road from 11 in Punganur

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *