Date:05/12/2020
పుంగనూరు ముచ్చట్లు:
పుంగనూరులో పురాతనమైన శ్రీ కళ్యాణ వెంకటరమణస్వామి ఆలయాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , చిత్తూరు ఎంపీ రెడ్డెప్పతో కలసి శనివారం టీటీడీలో విలీనం చేస్తూ ఉత్తర్వులు అందజేశారు. ఆలయ అభివృద్ధి కోసం మంత్రి టీటీడీలో విలీనం చేసేందుకు చర్యలు చేపట్టారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే విలీన కార్యక్రమాన్ని నిర్వహించారు. మంత్రి పెద్దిరెడ్డికి ఆలయంలో పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి పెద్దిరెడ్డి టీటీడీ అధికారులతో సమావేశమైయ్యారు. దేవాదాయశాఖ ఏసీ చంద్రమౌళి, ఈవో కమలాకర్ ద్వారా టీటీడీ అధికారులకు గుడి రికార్డులను అప్పగించారు. ఈ కార్యక్రమంలో పుంగనూరు స్పెషలాఫీసర్ రాజశేఖర్‌నాయుడు, కమిషనర్ కెఎల్.వర్మ, డిఎస్పీ గంగయ్య, పార్టీ నాయకులు బైరెడ్డిపల్లె క్రిష్ణమూర్తి, కొండవీటి నాగభూషణం, అక్కిసాని భాస్కర్‌రెడ్డి, నాగరాజారెడ్డి, వెంకటరెడ్డి యాదవ్, ఆవుల అమరేంద్ర, ఫకృద్ధిన్‌షరీఫ్, పార్టీ జిల్లా కార్యదర్శి చంద్రారెడ్డి యాదవ్,జయరామిరెడ్డి పాల్గొన్నారు.
బావిలోకి దూసుకుపోయిన కారు..ప్రయాణికులు సురక్షితం
Tags: Punganur Sri Kalyana Venkataramanaswamy Temple handed over to TTD by Minister Peddireddy