పుంగనూరు నుంచి తిరువణామలై ఆర్టీసి చార్జీ రూ.540
పుంగనూరు ముచ్చట్లు:
పుంగనూరు నుంచి తిరువణామలైకి బస్సు చార్జీ రూ.540లు రాయితీపై కల్పిస్తున్నట్లు డిపో మేనేజర్ సుధాకరయ్య తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు పున్నమి పర్వదిన సందర్భంగా తిరువణామలైలో గిరి ప్రదక్షణం చేయడం ఆనవాయితీ. వేల సంఖ్యలో ఈ ప్రాంతాల నుంచి భక్తులు వెళ్తుంటారని , వారి కోరిక మేరకు బస్సును నడుపుతున్నామన్నారు. అలాగే రిజర్వేషన్ సౌకర్యం కూడ కల్పించామని తెలిపారు. ప్రజలు ఆర్టీసి సేవలు వినియోగించుకోవాలన్నారు.

Tags: Punganur to Tiruvannamalai RTC fare is Rs.540
