Natyam ad

పుంగనూరు ట్రిపుల్‌ఐటి విద్యార్థి జానీబాషాకు ఇండియన్‌ అఛీవర్స్ అవార్డు

పుంగనూరు ముచ్చట్లు:

వైఎస్సార్‌ జిల్లా పులివెందుల ఇడుపులపాయలో ట్రిపుల్‌ ఐటి చదువుతున్న పుంగనూరు నివాసి , విద్యార్థి షేక్‌ జానీబాషాకు ఇండియన్‌ అఛీవర్స్ అవార్డు 2022 ను అందజేశారు. న్యూఢీల్లీ కేంద్రంగా ఉన్న ఇండియన్‌ అఛీవర్స్ ఫోరం వారు స్టడీకామ్రెడ్‌ సీఈవోగా ఉన్న జానీబాషాకు అవార్డును, సర్టిఫికెట్‌ను బుధవారం అందజేశారు. కాగా జానీబాషా స్టడీకామ్రెడ్‌ పేరుతో ఇడుపులపాయ అధ్యాపకులు, విద్యార్థులు సహకారంతో చేపట్టిన స్టడీకామ్రెడ్‌ ద్వారా తక్కువ ఖర్చుతో ఉన్నత విదేశి చదువులు ఆన్‌లైన్‌ ద్వారా అందించడం విజయవంతమైంది. జూలై 5న ఏపి నుంచి జానీబాషాను ఎంపిక చేసి గుజరాత్‌లో కేంద్ర ప్రభుత్వం స్టార్టప్‌ ఆఫ్‌ ఇండియా ఈకోసిస్టం క్రింద రూ.15 లక్షల నగదు అవార్డును అందజేసింది. జానీబాషా మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి ఏర్పాటు చేసిన ట్రిపుల్‌ ఐటిలో సీటు లభించడం తన అభివృద్ధికి కారణమైందన్నారు. ట్రిపుల్‌ ఐటి సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు.

Post Midle

Tags: Punganur TripleIT Student Johnny Basha Indian Achievers Award

Post Midle

Leave A Reply

Your email address will not be published.