పుంగనూరును పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తాం- ఎంపీ మిధున్‌రెడ్డి

పుంగనూరు ముచ్చట్లు:

 

పుంగనూరు నియోజకవర్గాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నట్లు లోక్‌సభ ప్యానల్‌స్పీకర్‌ , ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డి తెలిపారు. ఆదివారం మండలంలోని ఆరడిగుంట వద్ద రూ.60 కోట్లతో నిర్మించనున్న గాయత్రి గ్యాస్‌ సిలీండ్ల ఫ్యాక్టరీ నిర్మాణ పనులకు భూమిపూజ చేసి ప్రారంభించారు. ఎంపీ మాట్లాడుతూ ఆరడిగుంట ప్రాంతంలో శ్రీకాళహస్తీ పైపుల ఫ్యాక్టరీకి సుమారు 60 ఎకరాల భూమిని కేటాయించడం జరిగిందన్నారు. త్వరలోనే పనులు ప్రారంభిస్తారని తెలిపారు. అలాగే ఫీడ్‌ ఫ్యాక్టరీ నిర్మాణానికి భూమికేటాయించామన్నారు. పుంగనూరు నియోజకవర్గాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకురావాలని పిలుపునిచ్చారు. పరిశ్రమలు ఏర్పాటు చేసే వారికి ప్రభుత్వ పరంగా ప్రత్యేక రాయితీలు, వసతులు కల్పించి, భూమిని ప్రభుత్వ పరంగా కేటాయిస్తామన్నారు. త్వరలోనే పరిశ్రమల ఏర్పాటు చేసి, నిరుద్యోగులకు ఉపాధి కల్పించి , పుంగనూరును అభివృద్ధి చేస్తామన్నారు. ఈ సందర్భంగా కంపెనీ యజమానులు ఎంపీని గజమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, సిలీండర్ల ఫ్యాక్టరీ చైర్మన్‌ జబ్బాల శ్రీనివాసులు, ఏపీఐఐసీ చైర్మన్‌ షమీమ్‌అస్లాం, రాష్ట్ర జానపదకళల సంస్థ చైర్మన్‌ కొండవీటి నాగభూషణం, పీకెఎం ఉడా చైర్మన్‌ వెంకటరెడ్డి యాదవ్‌, ఏఎంసీ చైర్మన్‌ నాగరాజారెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి బైరెడ్డిపల్లె రెడ్డెప్ప, వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యదర్శి ఫకృద్దిన్‌షరీఫ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags: Punganur will be developed industrially – MP Midhun Reddy

 

Leave A Reply

Your email address will not be published.