Punganur Zamindarini, former MLA Ranisundarammani killed

పుంగనూరు జమీందారిని, మాజీ ఎమ్మెల్యే రాణిసుందరమ్మణ్ణి మృతి

– మంత్రి పెద్దిరెడ్డి సంతాపం

Date:04/034/2020

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు జమీందారిణి , మాజీ ఎమ్మెల్యే రాణిసుందరమ్మణ్ణి శనివారం మృతి చెందారు. పుంగనూరు సంస్థాన అధిపతి రాజవీరబసవ చిక్కరాయల్‌ భార్య అయిన రాణిసుందరమ్మణ్ణి గత కొంత కాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆమె బెంగళూరులో మృతి చెందారు. కాగా 1970లో జరిగిన ఉప ఎన్నికల్లో , 1972లో రాణిసుందరమ్మణ్ణి కాంగ్రెస్‌ పార్టీ తరపున పోటీ చేసి రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైయ్యారు. ఈమెకు కుమారులు, కుమారైలు , మనవరాళ్లు, మనవళ్లు ఉన్నారు. కాగా ఆమె మరణ వార్త తెలిసిన వెంటనే మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జమీందారి కుటుంబీకులకు సంతాపం తెలిపారు. జమీందారిణి అంత్యక్రియలు ఆదివారం పట్టణంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

Tags: Punganur Zamindarini, former MLA Ranisundarammani killed

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *