Punganuru hit with applause

చప్పట్లతో దద్దరిల్లిన పుంగనూరు

Date:22/03/2020

పుంగనూరు ముచ్చట్లు:

చప్పట్లు కొట్టి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే గోకుల్‌ సర్కిల్‌లో మాజీ జెడ్పీటీసీ వెంకటరెడ్డి యాదవ్‌ ఆధ్వర్యంలో చప్పట్లు కొట్టే కార్యక్రమం నిర్వహించారు. అలాగే పట్టణంలోని ఎన్‌ఎస్‌.పేటలో ముస్లిం మైనార్టీ నాయకురాలు రేష్మా ఆధ్వర్యంలో మహిళలు చప్పట్లు కొట్టారు. అలాగే హ్గటళ్ల సంఘ నాయకులు రెడ్డిప్రసాద్‌, మంజునాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో బస్టాండులో చప్పట్లు కొట్టారు. అలాగే ఉబేదుల్లా కాంపౌండులో మున్సిపల్‌ ఉద్యోగ కార్మిక సంఘ అధ్యక్షుడు ఫకృద్ధిన్‌ షరీఫ్‌, నానబాలవీధిలో అజీజ్‌సాబ్‌, ఇంతియాజ్‌ ఆధ్వర్యంలో చప్పట్లు కొట్టే కార్యక్రమం నిర్వహించారు. గోకుల్‌ వీధిలో అంజుమన్‌ కమిటి కార్యదర్శి అమ్ము , కిజర్‌ఖాన్‌ ఆధ్వర్యంలో చప్పట్లు కొట్టారు. ఎంఎస్‌ఆర్‌ కూడలీలో బిజెపి నేతలు అయూబ్‌ఖాన్‌, శ్రావణ్‌కుమార్‌ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రావణ్‌కుమార్‌ మాట్లాడుతూ ప్రధానినరేంద్ర మోదీ పిలుపు మేరకు చప్పట్లు కొట్టే కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో ఉష్ణోగ్రత పెరిగి, కరోనా వైరస్‌ నివారణకు ఉపయోగపడుతుందన్నారు. ప్రధాని నరేంద్రమోదీ పిలుపుతో అన్ని వర్గాల వారు సహకరించి జనతా కర్ఫ్యూను జయప్రదం చేసినందుకు పార్టీ తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు రాజాజెట్టి, గణేష్‌, పురుషోత్తం, బాబు, మురళి, రమేష్‌, భక్తవత్సలం, ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

భర్త వేదింపులతో భార్య , ముగ్గురు పిల్లలు మృతి

Tags: Punganuru hit with applause

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *