స్వచ్చసర్వేక్షణ్‌లో పుంగనూరులో దుమ్ముదుళిపారు

Punganuru in the Swarnarvarchy

Punganuru in the Swarnarvarchy

Date:10/11/2018

పుంగనూరు ముచ్చట్లు:

స్వచ్చసర్వేక్షణ్‌లో భాగంగా పుంగనూరు పట్టణంలోని అన్ని ప్రధాన రహదారులలోను మున్సిపల్‌ కార్మికులు శనివారం దుమ్ముదుళిపారు. మున్సిపల్‌ కమిషనర్‌ కెఎల్‌.వర్మ ఆధ్వర్యంలో స్వచ్చసర్వేక్షణ్‌ కార్యక్రమాలను పట్టణంలోని 24 వార్డుల్లోను వేగవంతం చేశారు. ఇందులో భాగంగా పట్టణంలోని ఎంబిటి రోడ్డు, బస్టాండు , గోకుల్‌ సర్కిల్‌, ఇందిరాసర్కిల్‌, తూర్పువెహోగశాలలోని ప్రాంతాలలోని జాతీయ రహదారిని మున్సిపల్‌ కార్మికులందరు కలసి శుభ్రంగా చెత్తాచెదారం లేకుండ ఉడ్చివేశారు. ఈ సందర్భంగా రోడ్లకు ఇరువైపులా బ్లిచింగ్‌ పౌడర్‌ వేశారు. పట్టణంలో దీపావళి సందర్భంగా చెత్తాచెదారాలతో రోడ్లు నిండిపోవడంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. అలాగే పట్టణంలో తడిచెత్త, పొడిచెత్తను వేరుచేసి, ఆ చెత్తను తూకం వేసి, కంపోస్ట్ యార్డులకు తరలించారు. ఈ సందర్బంగా కమిషనర్‌ కెఎల్‌.వర్మ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు మున్సిపాలిటి పరిధిలోని 24 వార్డుల్లోను ప్రతి ఇంటా తడిచెత్తను పొడిచెత్తను వేరుచేసే కార్యక్రమాలు చేపట్టామన్నారు. తడిచెత్త, పొడిచెత్తను వేరుచేసి, వాటిని కంపోస్ట్ యార్డులకు ఎప్పటికప్పుడు తరలిస్తున్నామన్నారు. దీని ద్వారా వర్మికంపోస్ట్ ఎరువును తయారు చేసి, రైతులకు ఎరువులను విక్రయిస్తున్నామన్నారు. దీని ద్వారా మున్సిపల్‌ ఆదాయాన్ని పెంపొందించడంతో పాటు ఆర్గానిక్‌ పద్దతుల ద్వారా సేంద్రియ ఎరువులను రైతులకు తక్కువ ధరలకు విక్రయించడం జరుగుతుందన్నారు. పట్టణంలో ప్లాస్టిక్‌ను పూర్తి స్థాయిలో నిష్యేధించామన్నారు. పట్టణంలోని అన్ని రకాల వ్యాపారులు, ప్రజల సహకారంతో పాస్టిక్‌ బ్యాగులను, వస్తువులను నిషేధించి, వాటి స్థానంలో పేపర్‌ బ్యాగులు, గుడ్డబ్యాగులను వినియోగించేలా చైతన్యం తీసుకొచ్చామన్నారు. ఈ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు పాలకవర్గ సభ్యులు పర్యవేక్షిస్తున్నారని ఆయన తెలిపారు. స్వచ్చసర్వేక్షణ్‌ పోటీలు డిసెంబర్‌ వరకు కొనసాగుతుందన్నారు. ఈ పోటీలలో దేశ స్థాయిలో పుంగనూరును అగ్రస్థానంలో నిలిపేందుకు ప్రతి ఒక్కరు స్వచ్చసర్వేక్షణ్‌లో బాగస్వామ్యులై జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ శానిటరీ ఇన్‌స్పెక్టర్లు సురేంద్రబాబు, సఫ్ధర్‌తో పాటు మున్సిపల్‌ కార్మికులు పాల్గొన్నారు.

 

చంద్రన్నా …. మీమాల్‌ ఎక్కడన్నా…

Tags: Punganuru in the Swarnarvarchy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *