పుంగనూరును అన్ని విధాల అభివృద్ధి చేస్తాం

Punganuru will be developed in all ways

Punganuru will be developed in all ways

Date:30/01/2019

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయనున్నట్లు రామచంద్ర తెలిపారు. బుధవారం ఆయన మున్సిపాలిటి పరిధిలో తడిచెత్త, పొడిచెత్తను వేరు చేసేందుకు డస్ట్బిన్నులు కొనుగోలుకు రూ.60 వేలు విరాళం ఇచ్చారు. సంకల్పసోసైటి సభ్యులు జానికి,క్రిష్ణమూర్తి,రాజన్న, సురేష్‌లకు విరాళాన్ని అందజేశారు. అలాగే మండలంలోని పెద్దభరిణేపల్లె గ్రామంలో సంక్రాంతి పండుగ సంబరాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామచంద్ర మాట్లాడుతూ మున్సిపాలిటిలో స్వచ్చ సర్వేక్షణ్‌ కార్యక్రమాలను పటిష్టంగా అమలు చేసేందుకు , ప్లాస్టిక్‌ను పూర్తి స్థాయిలో నిషేధించేందుకు తమ వంతు సహకారం అందిస్తామన్నారు. అలాగే పుంగనూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు శక్తివంచన లేకుండ పోరాటం చేస్తామని తెలిపారు. తన ఈ పోరాటానికి ప్రజలు ఆశీస్సులు అందించాలని కోరారు.

 

జాతిపితకు ఘన నివాళులు

Tags: Punganuru will be developed in all ways

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *