పుంగనూరులో అవయవాల దానంతో పునర్జన్మ – న్యాయమూర్తి వాసుదేవరావు

పుంగనూరు ముచ్చట్లు:

ప్రాణపాయంలో ఉన్న బాధితులకు అవయవాలు దానం చేసి పునర్జన్మను ప్రసాదించాలని సీనియర్‌ సివిల్‌జడ్జి వాసుదేవరావు పిలుపునిచ్చారు. శనివారం శుభారాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్‌ రాజశేఖర్‌ ఆధ్వర్యంలోఅవయదానాలపై విద్యార్థులతో అవగాహన సదస్సు నిర్వహించారు. న్యాయమూర్తి మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు తమ అవయవాలను దానం చేసేందుకు ముందుగా నమోదు చేసుకోవాలన్నారు. బ్రైన్‌డెడ్‌తో పాటు తదితర కారణాలతో ప్రాణాలు కోల్పోయేవారు ముందుగా కళ్ళు, కిడ్నీలు, గుండె అవయవాలనుదానంగా అందించడంతో ఇతరులకు అవి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. అవయవాల లోపం ఉన్న వారు ఇలాంటి అవయవాలు అమర్చుకోవడంతో వారికి పునర్జమ్మ లభిస్తుందని తెలిపారు. దీనిపై విరివిగా ప్రచారం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదుల సంఘ అధ్యక్షుడు విజయకుమార్‌, అధ్యాపకులు నందీశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు.

 

Tags: Pungaramma with organ donation in Punganur – Justice Vasudeva Rao

Leave A Reply

Your email address will not be published.