దేశ చరిత్రలో పుంగనూరు స్థానం పదిలం

Pungunuru position in country history

Pungunuru position in country history

– ఎక్సెజ్‌ సీఐ శ్రీనివాసులురెడ్డి

Date:23/11/2018

పుంగనూరు ముచ్చట్లు:

భారతదేశ చరిత్రలో పుంగనూరు స్థానం పదిలమైందని ఎక్సెజ్‌ సీఐ శ్రీనివాసులురెడ్డి తెలిపారు. శుక్రవారం ఉదయం ఇందిరాసర్కిల్‌లో వందరోజుల జాతీయగీతాలాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధులుగా మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ ఆవుల అమరేంద్ర, కమిషనర్‌ కెఎల్‌.వర్మ , సీఐ నాగశేఖర్‌ , ఎక్సెజ్‌ సీఐ శ్రీనివాసులురెడ్డి , లయన్స్క్లబ్‌ జిల్లాపీఆర్‌వో డాక్టర్‌ పి.శివ, డాక్టర్‌ కె. సరళ, జెఏసీ చైర్మన్‌ వరదారెడ్డి, వైఎస్‌ఆర్‌సిపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అక్కిసాని భాస్కర్‌రెడ్డి, వైఎస్‌ఆర్‌సిపి జెడ్పిప్లోర్‌లీడర్‌ వెంకటరెడ్డి యాదవ్‌లు హాజరైయ్యారు. పూలే విగ్రహానికి , తెలుగుతల్లి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. 8 గంటలకు పోలీస్‌ సైరన్‌తో ప్రారంభమైన గీతాలాపనకు గౌరవ వందనం చేశారు. ఈ సందర్భంగా సీఐ శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ జాతీయగీతాలాపనకు మున్సిపల్‌ పాలకవర్గంతో పాటు అన్నిశాఖ అధికారులు సంపూర్ణ సహకారాన్ని అందించడం జరుగుతోందన్నారు. ఇలాంటి మహాత్తర కార్యక్రమాలతో యువతలో దేశభక్తి పెంపొందించేందుకు వీలుందన్నారు. జెఏసీ చైర్మన్‌ వరదారెడ్డి మాట్లాడుతూ జాతీయగీతాన్ని కొనసాగించడం తొలుత కష్టమైందన్నారు. కానీ ప్రజల్లో చైతన్యం రావడంతో ఈ కార్యక్రమం విజయవంతమైందన్నారు. పిడిఎఫ్‌ అధ్యక్షుడు భానుప్రసాద్‌ మాట్లాడుతూ పుంగనూరుకు పేరు ప్రఖ్యాతలు రావడానికి ఇంతటి కన్నా మించిన మహాత్తర కార్యక్రమం ఏది లేదన్నారు. ఇలాంటి జాతీయగీతాలాపనలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యులై , పుంగనూరు వాసులుగా కాలరేగరేసుకుని చెప్పుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కమిటి సభ్యులు ప్రకాష్‌, అయూబ్‌ఖాన్‌, దీపక్‌, శ్యామ్‌ప్రసాద్‌, ముత్యాలు, రెడ్డిప్రసాద్‌లను పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ అధికారులు వెంకట్రామయ్య, రమణారెడ్డి, ఐకెపి కో-ఆర్డినేటర్‌ మ్యధుసూధన్‌రెడ్డి, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు సురేంద్రబాబు, సఫ్ధర్‌, ఉపాధ్యాయనేతలు క్రిష్ణంరాజు, వెంకటేశ్వర్‌రెడ్డి యాదవ్‌, అయూబ్‌, అనీల్‌, చాంబర్‌ ఆఫ్‌ కామర్స్ అధ్యక్షుడు బానుప్రకాష్‌, పుంగనూరు మెడికల్‌ అసోషియేషన్‌ కార్యదర్శి అమరనాథ్‌, కుమార్‌ పోలీస్‌ అకాడమి డైరెక్టర్లు కుమార్‌, ఆనందకుమార్‌, బిజెపి రాష్ట్రమోర్చా కార్యదర్శి అయూబ్‌ఖాన్‌, తెలుగుదేశం నాయకుడు సుబ్బరాయప్ప, పట్టణ పెద్దలు తజ్ముల్‌బాషా, అజీజ్‌, సంకల్ప కమిటి సభ్యులు రాజా, వాసు, సురేష్‌, రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమి డైరెక్టర్‌ చంద్రమోహన్‌రెడ్డి, ఎస్సీసెల్‌ అధ్యక్షుడుఎం.శంకరప్ప, వైఎస్‌ఆర్‌సిపి బూత్‌ కమిటిల అధ్యక్షుడు రెడ్డెప్ప, ఎస్‌డిపిఐ నాయకులు అతిక్‌బాషా, అస్లాంమురాధియా, పిడిఎఫ్‌ అధ్యక్షుడు భానుప్రసాద్‌, వైఎస్‌ఆర్‌సిపి యువజన సంఘ నాయకులు రాజేష్‌, యుగంధర్‌, గౌస్‌బాషా, ఖాదర్‌బాషా, గిరిధర్‌, వినాయక, తదితరులు పాల్గొన్నారు.

జాతీయ గీతానికి సలామ్‌

Tags; Pungunuru position in country history

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *