కరాటే పోటీల్లో పుంగనూరు విద్యార్థుల ప్రతిభ

Pungunuru students' talents in karate competitions

Pungunuru students' talents in karate competitions

Date:08/10/2018

పుంగనూరు ముచ్చట్లు:

కర్నాటక రాష్ట్రంలోని దొడ్దనకుండిలో జరిగిన కెన్‌-ఈ-మబునిషిటోరియా కరాటే సౌత్‌ ఇండియా పోటీలలో పుంగనూరుకు చెందిన విద్యార్థులు ఓవరాల్‌ చాంపియన్‌షిప్‌ ట్రోఫిని కైవసం చేసుకున్నారు. ఆది, సోమవారాలలో జరిగిన పోటీలకు కరాటే అధ్యక్షుడు రామచంద్ర ఆధ్వర్యంలో పుంగనూరు పరిసర ప్రాంతాల నుంచి 70 మంది విద్యార్థులు పోటీలలో పాల్గొన్నారు. ఈ పోటీలలో కటా, కుమితే విభాగాలలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు కైవసం చేసుకుని, ఓవరాల్‌ చాంపియన్‌షిప్‌ ట్రోఫిని డూ ఫెడరేషన్‌ ఉపాధ్యక్షులు గణేష్‌ చేతులు మీదుగా అందుకున్నారు. ఈ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు 30వ జాతీయ కరాటే పోటీలకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను కరాటే మాస్టర్లు సదాశివ, సునీల్‌, మంజునాథ్‌, రెడ్డిమహేష్‌ అభినందించారు.

మాజీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఫేస్‌బుక్ పేజ్ హ్యాక్

Tags: Pungunuru students’ talents in karate competitions

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed