Punjab government pays compensation to deceased farmer families

మృతి చెందిన రైతు కుటుంబాల‌కు పంజాబ్ ప్ర‌భుత్వం న‌ష్ట‌ప‌రిహారం

Date:03/12/2020

చండీగ‌ఢ్  ముచ్చట్లు:

కేంద్ర వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా జ‌రుగుతున్న నిర‌స‌న‌లో మృతిచెందిన రైతు కుటుంబాల‌కు పంజాబ్ ప్ర‌భుత్వం న‌ష్ట‌ప‌రిహారం ప్ర‌క‌టించింది. ఒక్కో రైతు కుటుంబానికి రూ. 5 ల‌క్ష‌ల చొప్పున న‌ష్ట‌ప‌రిహారాన్ని ప్ర‌క‌టించింది. మాన్సా జిల్లాలోని బచోనా గ్రామంలో నివసిస్తున్న గుర్జంత్ సింగ్(60) ఆందోళన సమయంలో ఢిల్లీలోని తిక్రీ సరిహద్దులో మరణించగా, మోగా జిల్లాలోని భిందర్ ఖుర్ద్ గ్రామ నివాసి గుర్బాచన్ సింగ్(80) నిరసన సందర్భంగా గుండెపోటుకు గురై బుధ‌వారం నాడు కన్నుమూశారు. రైతుల మృతిపై పంజాబ్ ముఖ్య‌మంత్రి అమ‌రీంద‌ర్ సింగ్‌ విచారం వ్య‌క్తం చేశారు. ప్ర‌భుత్వం త‌ర‌పున‌ కుటుంబానికి రూ.5 ల‌క్ష‌ల చొప్పున ప‌రిహారం ప్ర‌క‌టించారు. కేంద్ర ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన మూడు వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను నిర‌సిస్తూ పంజాబ్‌, హార్యానా, ఇత‌ర రాష్ర్టాల రైతులు దేశ రాజ‌ధాని న‌గ‌రం ఢిల్లీ, స‌రిహ‌ద్దు ప్రాంతాల్లో ఆందోళ‌న‌ల‌ను చేస్తున్నారు.

48,49,50 డివిజన్లలో మంత్రి సొంత నిధులతో బియ్యం పంపిణీ

Tags:Punjab government pays compensation to deceased farmer families

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *