పుంజుకుంటేనే..ప్రభావం.. 

Date:06/11/2018

ఖమ్మం ముచ్చట్లు:

మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణల్లో అధికార పార్టీల వైఫల్యాల్ని ఎండగట్టి.. ప్రజామద్దతును కూడగట్టుకోవడం కాంగ్రెస్‌కు చాలా అవసరం. లేకపోతే తమ నేతృత్వంలోనే విపక్షాలన్నీ 2019 లోక్‌సభ ఎన్నికల్ని ఎదుర్కొంటాయని కాంగ్రెస్‌ చేస్తున్న వాదన విలువ లేనిదై పోతుంది. తెలంగాణ ఎన్నికలైతే.. కాంగ్రెస్ కు అత్యంత ప్రతిష్టాత్మకం. ఎందుకంటే.. తెలంగాణ ఇచ్చినా.. ఆ క్రెడిట్ ను క్యాష్ చేసుకోవడంలో హస్తంపార్టీ చతికిలపడింది. వివిధ ఫ్యాక్టర్స్ వల్ల.

 

గత ఎన్నికల్లో ఉద్యమపార్టీ టీఆర్ఎస్ అధికారం కైవసం చేసుకుంది. ఈ దఫా ఎలాగైనా పవర్ చేజిక్కించుకోవాలన్న పట్టుమీద ఉంది కాంగ్రెస్. ఈ క్రమంలోనే ఇతర విపక్షాలతో కలిసి ప్రజాకూటమి ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ కు చెక్ పెట్టేందుకు.. సర్వశక్తులూ ఒడ్డుతోంది. తెలంగాణలో ప్రభుత్వ వ్యతిరేకత కలిసివస్తుందని కాంగ్రెస్ ఆశిస్తోంది. అయితే సీఎం కేసీఆర్ తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. కాంగ్రెస్, ప్రజాకూటమిని విమర్శలతో జాడించేస్తున్నారు. 60ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ రాష్ట్రానికి చేసిందేమీ లేదని.. నాలుగున్నరేళ్లలోనే రాష్ట్రాన్ని ప్రగతిపథంలోకి తీసుకొచ్చామని చెప్తున్నారు.

 

ప్రజాకూటమిలో .. సీట్ల సర్దుబాటు ఇంకా కొలిక్కి రాలేదు. 119 సీట్లు ఉన్న తెలంగాణలో మేజర్ స్థానాల్లో పోటీ చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. కొన్ని సీట్లకు మిత్రపక్షాల నుంచీ పోటీ ఉంది. ఈ సవాళ్లను అధిగమించి కాంగ్రెస్ ముందడుగేయాలి. ఇప్పటికే అభ్యర్ధుల ప్రకటనతో పాటూ.. ప్రచారపర్వంలో టీఆర్ఎస్.. కాంగ్రెస్ కంటే.. ముందంజలో ఉంది. లేట్ గా వచ్చినా.. మేజర్ ఎఫెక్ట్ చూపాలన్న ప్లాన్ చేస్తోంది కాంగ్రెస్.

 

దీనికోసం రాహుల్ సభలపై ప్రత్యేక దృష్టి సారించింది. యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీ ఒక రోజు, రాహుల్‌గాంధీ ఆరు రోజుల్లో ప్రచార సభల్లో పాల్గొనే అవకాశం ఉంది. మొత్తంగా వీరిద్దరితో 14 సభలు నిర్వహించాలని కాంగ్రెస్‌ నేతలు నిర్ణయించారు. సోనియాగాంధీ సభలతో తమ ప్రచారానికి మంచి జోష్‌ వస్తుందని పేర్కొంటున్నారు. ప్రజాకూటమిలోని పార్టీల మెయిన్ టార్గెట్ టీఆర్ఎస్. అందుకే.. తమ మధ్య విబేధాలు ఉన్నా.. టీఆర్ఎస్ కు చెక్ పెట్టాలన్న లక్ష్యం కోసం కలిసికట్టుగా ముందడుగేయాలని నేతలు నిర్ణయించుకున్నారు.

అధికార పార్టీ నేతలకు చేదు అనుభవాలు

Tags: Punjukunteneprabhavam ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *