Natyam ad

కొనుగోలు కేంద్రాలు సిద్ధం చేయాలి-అదనపు కలెక్టర్ రెవెన్యూ కే. సీతారామ రెడ్డి

నాగర్ కర్నూల్ ముచ్చట్లు:

 

వానాకాలం వరి ధాన్యం సేకరణకు కొనుగోలు కేంద్రాలు సిద్ధం చేయాలని అదనపు కలెక్టర్ రెవెన్యూ కే. సీతారామ రెడ్డి ఆదేశించారు.  బుధవారం ఉదయం నాగర్ కర్నూల్ ఐ.డి. ఒ.సి ప్రజావాణి హాల్లో వానాకాలం ధాన్యం కొనుగోలు పై  వ్యవసాయ, మార్కెటింగ్, సహకార సంఘం, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఐ.కే.పి., పి. ఎ.సి.ఎస్ వరి ధాన్యం కొనుగోలు ఇంఛార్జి లు, రైస్ మిల్ అసోసియేషన్, వ్యవసాయ శాఖ అధికారులతో ధాన్యం కోనుగోలు పై  సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేశారు.  జిల్లాలో త్వరలో  వరి కోతలు ప్రారంభం అవుతాయని,  రైతులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ధాన్యం కొనుగోలు చేపట్టాలని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు సూచించారు.  ఈసారి ఎ గ్రేడ్ రకం వరి క్వింటాలుకు రూ. 2203/- లు సాధారణ రకం ధాన్యానికి రూ. 2183/- ఇవ్వడం జరిగిందన్నారు.  వానాకాలం   సాగు ద్వారా జిల్లాలో 1.20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు  కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందని అంచనాలు వేయడం జరిగిందన్నారు. ధాన్యం కొనుగోలు సజావుగా నిర్వహించేందుకు జిల్లాలో 216 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని అయితే ఇవి అవసరాన్ని బట్టి ప్రారంభించుకోవడం జరుగుతుందన్నారు. రైతులు పండించిన మొత్తం ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసేవిధంగా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు.  అయితే అందుకు ఒక ప్రణాళిక ఉండాలని సూచించారు.  ఐ.కే.పి. ద్వారా 12  సహకార సంఘం ద్వారా 204 కొనుగోలు కేంద్రాలు  ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.  వరి కోతను రైతులు అందరూ ఒకేసారి కాకుండా విడతలవారీగా వరికోత చేసేవిధంగా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ విస్తిర్ణాధికారులను సూచించారు.   ముందు కోత చేసే  వారికి ముందుగా టోకన్ లు ఇవ్వాలని తెలిపారు. ధాన్యం లారీని ఏ మిల్లుకైతే ముందుగా ట్యాగింగ్ చేశారో అదే మిల్లుకు వెళ్ళాలని అలా కాకుండా వేరే మిల్లుకు వెళితే మాత్రం చర్యలు తప్పవని హెచ్చరించారు.  అన్ని కొనుగోలు కేంద్రాల్లో రైతులకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.   ప్రతి కొనుగోలు కేంద్రంలో తేమ శాతం కొలిచే యంత్రాలు, టార్పలిన్ లు, గన్ని బ్యాగులు,  రైతులకు తాగునీరు, మరుగుదొడ్లు, వంటి కనీస సౌకర్యాలు ఉండాలని ఆదేశించారు.  ఏరోజుకు ఆరోజు కొనుగోలు చేసిన ధాన్యం వివరాలు ఒ.పి.యం.ఎస్ ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని, తద్వారా రైతులకు డబ్బులు సకాలంలో అందేవిధంగా వీలు ఉంటుందన్నారు.  తాలు ఎక్కువగా ఉండకుండా వరి ధాన్యాన్ని తూర్పారబెట్టడం, యంత్రాల ద్వారా కోత చేసేటప్పుడు ఫ్యాన్ విధిగా నడిపించడం , ఎండలో ఆరబెట్టడం జరిగేవిధంగా  రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు.   తేమ శాతం 17 కు మించకుండా బాగా ఆరబెట్టిన ధాన్యం తీసుకురావాలని రైతులకు అవగాహన కల్పించాలన్నారు.  ఈ సారి అన్ని రైస్ మిల్లులకు ధాన్యం ఇవ్వబడదని, సి.యం.ఆర్ రైస్ ఎఫ్.సి ఐ. ఎవరైతే లక్ష్యం మేరకు ఇచ్చారో వారికి మాత్రమే కేటాయించనున్నట్లు తెలిపారు. 20 రోజుల్లో సి.యం.ఆర్ రైస్ లక్ష్యం మేరకు పూర్తి చేస్తే అప్పుడు ధాన్యం కేటాయిస్తామని అంతవరకు కేటాయించడం జరగదన్నారు.
జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి నర్సింగ్ రావు,  వ్యవసాయ శాఖ ఇంఛార్జి అధికారి చంద్రశేఖర్, సివిల్ సప్లై అధికారి స్వామి కిరణ్, డి.సి. ఓ. పత్యా నాయక్,  డి.యం. సివిల్ సప్లై బాలరాజు, రైస్ మిల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రమేష్ బాబు, మండల వ్యవసాయ అధికారులు, ఐ.కే.పి కేంద్రాల ఇంఛార్జి లు, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లు,  కోఆపరేటివ్ శాఖ కొనుగోలు కేంద్రాల ఇంఛార్జి లు తదితరులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: Purchase Centers to be prepared-Additional Collector Revenue k. Sitarama Reddy

Post Midle