-జిల్లా కలెక్టర్ ఏ. శరత్
Date:02/12/2020
కామారెడ్డి ముచ్చట్లు:
జిల్లాలో 3 లక్షల 53 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఏ. శరత్ ఆన్నారు. బుధవారంబాన్సువాడ, బీర్కూర్, నస్రుల్లాబాద్ తహసీల్దార్ కార్యాలయాలలో పల్లె ప్రగతి పై సమీక్ష సమావేశాలను నిర్వహించారు. రూ. 651 కోట్లు ధాన్యం విక్రయించిన రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు పేర్కొన్నారు. దాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా చర్యలు చేపట్టామన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడానికి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అవెన్యూ ప్లాంటేషన్లో నాటిన మొక్కలను సంరక్షణ చేపట్టాలని సూచించారు. మొక్కలు ఎండిపోతే పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్ లపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. బాన్స్వాడ నియోజకవర్గంలో బీర్కుర్ లో 175 రిజిస్ట్రేషన్లు పూర్తిచేసి డివిజన్లో మొదటి స్థానంలో ఉందని చెప్పారు. పల్లె ప్రకృతి వనాలు పచ్చదనంతో కళకళలాడే విధంగా మొక్కలు దగ్గరదగ్గరగా నాటాలని సూచించారు. నడకదారి, బెంచీలు ఏర్పాటు చేయాలని కోరారు. ఉపాధి హామీ పనులకు 25 శాతం కూలీలు వచ్చే విధంగా చూడాలని అధికారులను ఆదేశించారు. ధరణి లో రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులకు పాసు పుస్తకాలు అందజేశారు. బాన్సువాడలో రైస్ మిల్లు ను పరిశీలించారు. లక్ష్యానికి అనుగుణంగా బియ్యాన్ని మిల్లింగ్ చేయాలని కోరారు. తిమ్మాపూర్ లోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, డి ఆర్ డి ఓ చంద్రమోహన్ రెడ్డి, ఆర్డిఓ రాజా గౌడ్, ప్రత్యేక అధికారి శ్రీకాంత్, అధికారులు పాల్గొన్నారు.
Tags; Purchase of 3 lakh 53 thousand metric tons of grain in the district