Purchase of MaleChat apparel from Salem: TTD's current Evo AVDarmareddy

సేలం నుండి మేల్‌ఛాట్ వ‌స్త్రాల కొనుగోలు : టిటిడి అద‌న‌పు ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి

Date:05/05/2020

తిరుమ‌ల ముచ్చట్లు:

తిరుమ‌ల శ్రీ‌వారికి అలంక‌రించేందుకు 8 మేల్‌ఛాట్ వ‌స్త్రాలను సేలం నుండి కొనుగోలు చేశామ‌ని, జూన్ నెల వ‌ర‌కు ఇవి స‌రిపోతాయ‌ని టిటిడి అద‌న‌పు ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి తెలిపారు.తిరుమ‌ల‌లో మంగ‌ళ‌వారం అద‌న‌పు ఈవో మీడియాతో మాట్లాడుతూ టెండ‌ర్‌లో త‌క్కువ కోట్ చేసిన సేలంలోని త‌యారీదారుల నుండి మేల్‌ఛాట్ వ‌స్త్రాలు కొనుగోలు చేసిన‌ట్టు తెలిపారు. స్వామివారి మూల‌మూర్తికి అలంక‌రించేందుకు ప్ర‌త్యేక కొల‌త‌ల‌తో ఈ చీర‌ను త‌యారుచేస్తార‌ని చెప్పారు. సేలంలో మాత్ర‌మే మేల్‌ఛాట్ వ‌స్త్రాల‌ను త‌యారుచేస్తార‌ని, త‌యారీదారులు ఎంతో నియ‌మనిష్ట‌ల‌తో ఈ ప‌ట్టువ‌స్త్రాన్ని రూపొందిస్తార‌ని తెలిపారు.దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ నిబంధ‌న‌లు ఉండ‌డంతో సేలంలో సిద్ధమైన 8 మేల్‌ఛాట్ వ‌స్త్రాల‌ను తిరుమ‌ల‌కు తీసుకురావ‌డం క‌ష్టంగా మారింద‌ని, టిటిడి బోర్డు స‌భ్యులు శేఖ‌ర్‌రెడ్డి చొర‌వ తీసుకుని త‌మిళ‌నాడు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, డిజిపి అనుమ‌తులు తీసుకుని సేలం నుండి ఈ వ‌స్త్రాల‌ను తిరుమ‌ల‌కు తీసుకొచ్చార‌ని అద‌న‌పు ఈవో తెలిపారు.కోవిడ్ -19 వ్యాప్తిని నివారించేందుకు మార్చి 20వ తేదీ నుండి శ్రీ‌వారి ఆల‌యంలో భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం నిలిపివేసిన విష‌యం తెలిసిందే. ఈ కార‌ణంగా ప్ర‌స్తుతం 2 మేల్‌ఛాట్ వ‌స్త్రాలు మాత్ర‌మే మిగిలి ఉన్నాయి. ఈ క్ర‌మంలో టెండ‌రు ద్వారా 8 మేల్‌ఛాట్ వ‌స్త్రాల‌ను టిటిడి కొనుగోలు చేసింది.

కోవిడ్ బాధితులకు ఆక్సిజన్ కొరత

Tags: Purchase of MaleChat apparel from Salem: TTD’s current Evo AVDarmareddy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *