క్వింటాల్ వరి ధర రూ:1960 చొప్పున కొనుగోలు
చౌడేపల్లె ముచ్చట్లు:
రైతు భరోసా కేంద్రాల్లో క్వింటాల్ వరి ధర రూ:1960 చొప్పున ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నట్లు సింగిల్‌విండో చైర్మన్ రవిచంద్రారెడ్డి తెలిపారు. బుధవారం స్థానిక రైతు భరోసాకేంద్రంలో అగ్రికల్చర్ అసిసెంట్లతో వరి కొనుగోలు, పై అవగాహన సదస్సు జరిగింది. ఈ స్యధర్భంగా ఏఓ జ్యోతమ్మ మాట్లాడుతూ వరి ధాన్యం విక్రయించే రైతులు ముందుగానే రైతులు రైతుభరోసా కేంద్రంలో శాంపిల్స్ ఇవ్వాలన్నారు. రైతులు రిజిస్ట్రేషన్ తోపాటు పంట క్రాఫ్ బుకింగ్ చేసుకొని ఉండాలన్నారు. ఏ1 రకం ధర రూ:1960,సాధారణ రకానికి రూ:1940 క్వింటాల్ వరి ధర చొప్పున ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో పిఏసీఎస్ సీఈఓ మునిరాజ తదితరులున్నారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్మోహన్రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Purchase of rice at Rs. 1960 per quintal