కోతల సమయానికి కొనుగోళ్ల కేంద్రాలు సిద్దం

Purchasing centers are ready at the time of harvesting

Purchasing centers are ready at the time of harvesting

 Date:18/09/2018
నిజామాబాద్ ముచ్చట్లు:
వానాకాలంలో వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై సమీక్ష సమావేశం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ పొచారం శ్రీనివాస రెడ్డి నిర్వహించారు. జిల్లా కలెక్టరేట్ లోని ప్రగతి భవన్ లో జరిగిన ఈ సమావేశంలో మంత్రి పోచారం మాట్లాడుతూ ముందస్తుగా సాగు చేసిన వరి, మొక్కజొన్న పంటల కోతలు త్వరలోనే మొదలవుతాయి. ధాన్యం వచ్చేనాటికే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని సూచించారు. ప్రభుత్వం ముందుగానే ఏర్పాటు చేస్తే డిమాండ్ పెరుగుతుంది, ప్రైవేటు వ్యాపారులు కూడా మద్దతు ధరకు కొనుగోలు చేస్తారు. రైతులు నష్టపోరు.
అక్టోబర్ 1 నుండి కొనుగోలును మొదలుపెట్టాలి.  ఈలోపే అవసరమైన వసతులను, సౌకర్యాలను ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. గన్నీబ్యాగుల కొరతలేకుండా ముందస్తుగా తెప్పించుకోవాలి. సహకార సంఘాలలో ఆన్ లైన్ సౌకర్యం సమకూర్చుకోని చెల్లింపులను త్వరితంగా చేయాలని అన్నారు.  ధాన్యం అమ్మిన తర్వాత 48 గంటలలోగా రైతులకు నగధు చెల్లింపు పూర్తి కావాలి. వరి ధాన్యం కొనుగోలుకు నిజామాబాద్ జిల్లాలో 260, కామారెడ్డి జిల్లాలో 205 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం.
మొక్కజొన్న కొనుగోలుకు నిజామాబాద్ జిల్లాలో 59, కామారెడ్డి జిల్లాలో 33 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.  పెసర, కంది, మినుముల కొనుగోలుకు నాఫెడ్ కు ప్రపోసల్స్ పంపాం రాగానే కొనుగోలు ప్రారంభిస్తాం.  ఈ సమావేశంలో నిజామాబాద్ మరియు కామారెడ్డి జిల్లాల కలెక్టర్లు, వ్యవసాయ, రెవిన్యూ,   మార్క్ ఫెడ్, పౌరసరఫరాల శాఖ అధికారులు పాల్గొన్నారు.
Tags:Purchasing centers are ready at the time of harvesting

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *